Donald Trump | మేము అన్నింటిలోనూ గెలుస్తున్నాం.. డ్రగ్ బాస్ ఎల్ మెంచో మరణంపై ట్రంప్ ఆసక్తికర పోస్ట్
Donald Trump | మెక్సికోలో పేరుమోసిన డ్రగ్ బాస్ (Mexico drug boss) ఎల్ మెంచో (El Mencho) మరణంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా స్పందించారు.
International | Published On Feb 23, 2026, 11.37 am IST
Donald Trump | మెక్సికోలో పేరుమోసిన డ్రగ్ బాస్ (Mexico drug boss) ఎల్ మెంచో (El Mencho) మరణంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తాజాగా స్పందించారు. తాము అన్ని విషయాల్లోనూ గెలుస్తున్నామంటూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ఇలా గెలవడం కూడా న్యాయం కాదంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు. "మేము చాలా ఎక్కువగా గెలుస్తున్నాము. ఇలా అన్నింటిలోనూ గెలవడం కూడా న్యాయం కాదు. ప్రెసిడెంట్ DJT (Donald J.Trump)" అని ట్రూత్‌లో పోస్టు చేశారు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కాగా, ప్రపంచ దేశాలను వణికించిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ (Mexicos most powerful cartel boss), జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (సీజేఎన్‌జీ) అధినేత నెమెసియో ఒసెగ్వెరా సెర్వాంటెస్ (Nemesio Oseguera Cervantes) అలియాస్ 'ఎల్ మెంచో' (El Mencho) హతమైన విషయం తెలిసిందే. పశ్చిమ మెక్సికోలోని జలిస్కో (Jalisco) రాష్ట్రం తపాల్పా పట్టణంలో మెక్సికన్ సైన్యం జరిపిన భారీ ఆపరేషన్‌లో అతడు హతమయ్యాడు. ఈ డ్రగ్ మాఫియా డాన్‌ను పట్టుకునే క్రమంలో సైన్యం జరిపిన కాల్పుల్లో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం మెక్సికో సిటీకి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని మెక్సికో సైన్యం ధృవీకరించింది. అతడి తలపై సుమారు 15 మిలియన్ డాలర్ల రివార్డు ఉంది. అంటే భారత కరెన్సీలో రూ.136.15 కోట్లు. అమెరికా నిఘా సంస్థల సహకారంతోనే అతన్ని అంతం చేసినట్లు వైట్‌హౌస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ పోస్టు పెట్టడం ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






