Venezuela Earthquake | వెనిజులా భూకంపం.. 235 మంది మృతి, 40 వేల మంది ఆచూకీ గల్లంతు
Venezuela Earthquake | వెనిజులాను భారీ భూకంపాలు (Venezuela Earthquake) వణికించాయి. సెకన్ల వ్యవధిలో సంభవించిన రెండు శక్తిమంతమైన భూప్రకంపనలు పెను విధ్వంసాన్ని మిగిల్చాయి.
International | Published On Jun 26, 2026, 1.20 pm IST
Venezuela Earthquake | త్రినేత్ర.న్యూస్: వెనిజులాను భారీ భూకంపాలు (Venezuela Earthquake) వణికించాయి. సెకన్ల వ్యవధిలో సంభవించిన రెండు శక్తిమంతమైన భూప్రకంపనలు పెను విధ్వంసాన్ని మిగిల్చాయి. రాజధాని కారకాస్ (Caracas)తోపాటు తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసిన కుప్పకూలిన భవనాలే దర్శనమిస్తున్నాయి. గంటలు గడుస్తున్న కొద్ది మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 235 మంది మృతి చెందగా, మరో 4300 మంది గాయపడ్డారు. ఈ మేరకు వెనిజులా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భూకంపాల అనంతరం దాదాపు 40 వేల మంది ఆచూకీ గల్లంతయ్యింది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

లా గువైరా, కారకాస్ పరిసర ప్రాంతాల్లో భారీగా నష్టం వాటిల్లింది. సుమారు 250కిపైగా భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించడం, వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం అత్యంత క్లిష్టంగా మారిందని అధికారులు తెలిపారు.

మరోవైపు మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై గందరగోళం నెలకొన్నది. భూకంపంలో సుమారు 10 వేల మందిదాకా మరణించి ఉంటారని అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే ఆ తర్వాత సంఖ్యను వందల్లోకి తీసుకొచ్చాయి.

యూఎస్‌జీఎస్ (USGS) మృతుల సంఖ్య లక్ష వరకు ఉండొచ్చని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
An earthquake that lasted only a few seconds caused devastation in Venezuela.
Oh God,
how terrifying the Day of Judgment will be. pic.twitter.com/mGzzQfMiG2— SilencedSirs◼️ (@SilentlySirs) June 25, 2026
Se siguen desplomando edificios en la zona costera de Venezuela. Más de 250 estructuras reducidas a escombros, según las autoridades. No sólo la construcción, es también las características del terreno sobre el que se alzan https://t.co/AaUrq66RXl pic.twitter.com/6buAjkxWEH
— Sandro Pozzi (@sandro_pozzi) June 25, 2026
Moments after the first earthquake in Caracas you can see the total destruction of the surrounding area.
Minutes later a massive 7.5 hit the same area finishing the job and leaving thousands trapped and unfortunately deceased.
California Democrats would love for this to happen… https://t.co/kSC0ZfzxDE pic.twitter.com/l5QebHImRZ
— B. Wilkins lll 🇺🇸 (@ScummyMummy511) June 25, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●July 2026 Financial Changes | జూలై నుంచి మారనున్న నిబంధనలు.. ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సినవి..
- ●Rain Alert | మరి కాసేపట్లో హైదరాబాద్‌లో వర్షం.. తెలంగాణ వెదర్‌మ్యాన్ హెచ్చరిక
- ●Surya bhai Arrest | గోల్డ్‌మెన్ సూర్యాభాయ్ మోసం.. ఎఫ్ఐఆర్ నమోదు
- ●Mother attack on Child | అమానుషం.. చిన్నారిని కాలితో తన్నిన తల్లి.. వీడియో
- ●Kamareddy Student | లండన్‌లో కామారెడ్డి జిల్లా యువకుడు అనుమానాస్పద మృతి
- ●Idupu Kayitham | ఇది ఏ భాష సినిమా - ఇడుపుకాయితం టైటిల్‌పై ఆంధ్రా ప్రజల అక్కసు - తెలంగాణవాదుల కౌంటర్

July 2026 Financial Changes | జూలై నుంచి మారనున్న నిబంధనలు.. ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సినవి..

Rain Alert | మరి కాసేపట్లో హైదరాబాద్‌లో వర్షం.. తెలంగాణ వెదర్‌మ్యాన్ హెచ్చరిక

Surya bhai Arrest | గోల్డ్‌మెన్ సూర్యాభాయ్ మోసం.. ఎఫ్ఐఆర్ నమోదు

Mother attack on Child | అమానుషం.. చిన్నారిని కాలితో తన్నిన తల్లి.. వీడియో






