Venezuela Earthquake | వెనెజువెలా భూకంపం.. మృతులు లక్ష వరకు ఉండొచ్చు: యూఎస్‌జీఎస్
Venezuela Earthquake | వెనెజువెలాను వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు (Venezuela Earthquake) కుదిపేశాయి. నిమిషం వ్యవధిలో 7.2, 7.5 తీవ్రతతో వచ్చిన భూ ప్రకంపణలు దేశ రాజధాని కారకాస్ (Caracas) ను వణికించాయి.
International | Published On Jun 25, 2026, 8.07 am IST
Venezuela Earthquake | త్రినేత్ర.న్యూస్: వెనెజువెలాను వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు (Venezuela Earthquake) కుదిపేశాయి. నిమిషం వ్యవధిలో 7.2, 7.5 తీవ్రతతో వచ్చిన భూ ప్రకంపణలు దేశ రాజధాని కారకాస్ (Caracas) ను వణికించాయి. పెద్ద సంఖ్యలో భవనాలు కుప్పకూలాయి. ఈ ప్రకృతి విపత్తు ధాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. మృతుల సంఖ్య 10 వేల నుంచి లక్ష వరకు ఉండే అవకాశం 44 శాతం ఉందని తెలిపింది. భారీ భూకంపాల నేపథ్యంలో ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితి (State of emergency)
విధించింది.
Severe disruptions and damage has now been reported at Simon Bolivar International Airport in Venezuela, following a 7.5 magnitude earthquake. pic.twitter.com/sy466aWmXz
— OSINTdefender (@sentdefender) June 24, 2026
కాగా, మృతుల సంఖ్యపై వెనెజువెలా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటణ చేయలేదు. అయితే ఎక్కడ చూసిన పేకమేడల్లా కూలిపోయిన భవనాలే కనిపిస్తుండటంతో పెద్ద సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకు పోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. గాయపడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉందని వెల్లడించారు. కారకాస్ నగరం మొత్తం దుమ్ము, ధూళితో నిండిపోయింది.
Passengers panic and run for cover at Simón Bolívar International Airport in Maiquetía, Venezuela, as the terminal shakes and power flickers, resulting from a massive 7.5 magnitude earthquake off the coast of Caracas. pic.twitter.com/uWN4ZqFjOZ
— OSINTdefender (@sentdefender) June 24, 2026
`భూకంపం ధాటికి మెట్లు ఊడిపడ్డాయి, గోడ మొత్తం పగుళ్లు వచ్చింది. పైకప్పు నుంచి వస్తువులు కింద పడ్డాయి. అది చాలా భయంకరంగా ఉంది` అని కారకాస్‌కు చెందిన 54 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి ఒడాలిస్ ఎస్కలోనా చెప్పారు. మరోవైపు సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పైకప్పు కూలిపోవడంతో అంతటా పొగ అలుముకుంది. ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు.
Utter devastation seen across the Northern Venezuelan coastal city of La Guaira, following tonight’s pair of major earthquakes, measuring 7.2 and 7.5 magnitude with an epicenter just to the west of Caracas. pic.twitter.com/BQv4YixUiB
— OSINTdefender (@sentdefender) June 25, 2026
More buildings seen severely damaged in Caracas, Venezuela following a 7.5 magnitude earthquake that struck to the west of the capital. pic.twitter.com/gkNPF3Gxdr
— OSINTdefender (@sentdefender) June 24, 2026
Footage seen from inside a building as the 7.5 magnitude earthquake struck in Venezuela. Severe damage has been reported across Northern Venezuela, as numerous reports of injuries have also been reported. pic.twitter.com/E2IohOsJAU
— OSINTdefender (@sentdefender) June 24, 2026
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్ కంటిన్యూ.. లాభాల్లో సూచీలు..
- ●Gajwel | దూప అవుతుందని డ్రిప్ పైపులో నీళ్లు తాగితే.. ప్రాణం పోయింది..
- ●Passport | పాస్‌పోర్ట్ ప్రయాణ పత్రం మాత్రమే.. పౌరసత్వ పత్రం కాదు : కేంద్రం
- ●NIACL | న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో అప్రెంటిస్‌లు.. ఏడాది శిక్షణతో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో అవకాశాలు..
- ●Bosnia vs Qatar | ఫిఫా వరల్డ్ కప్ 2026: ఖతార్ కథ కంచికే.. 18 ఏళ్ల కుర్రాడి మ్యాజిక్‌తో బోస్నియా చారిత్రక విజయం!
- ●SIR | రాష్ట్రంలో నేటి నుంచి సర్.. జూలై 24 వరకు ఇంటింటి సర్వే..

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్ కంటిన్యూ.. లాభాల్లో సూచీలు..

Gajwel | దూప అవుతుందని డ్రిప్ పైపులో నీళ్లు తాగితే.. ప్రాణం పోయింది..

Passport | పాస్‌పోర్ట్ ప్రయాణ పత్రం మాత్రమే.. పౌరసత్వ పత్రం కాదు : కేంద్రం

NIACL | న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో అప్రెంటిస్‌లు.. ఏడాది శిక్షణతో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో అవకాశాలు..






