USA | అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..
USA | అమెరికాలో హిందూ ఆలయంపై సామూహిక కాల్పులకు కుట్ర చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని అరోరా ప్రాంతంలో ఉన్న హిందూ ప్రార్థనా మందిరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి ప్రణాళిక రూపొందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడి నుంచి జాత్యహంకార, తీవ్రవాద భావజాలాన్ని వ్యక్తం చేసే పత్రంతోపాటు రైఫిల్, తూటాలు, వ్యూహాత్మక పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
International | Published On Oct 15, 2026, 11.49 am IST
USA | అమెరికాలో హిందూ ఆలయంపై సామూహిక కాల్పులకు కుట్ర చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని అరోరా ప్రాంతంలో ఉన్న హిందూ ప్రార్థనా మందిరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి ప్రణాళిక రూపొందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడి నుంచి జాత్యహంకార, తీవ్రవాద భావజాలాన్ని వ్యక్తం చేసే పత్రంతోపాటు రైఫిల్, తూటాలు, వ్యూహాత్మక పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని పాలటైన్‌కు చెందిన అలెగ్జాండ్రోస్ పాపోరాకిస్ (19)ను అక్టోబర్ 11న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరోరా ప్రాంతంలోని హిందూ ప్రార్థనా మందిరంపై సామూహిక కాల్పులకు పాల్పడేందుకు కుట్ర పన్నినట్లు వచ్చిన సమాచారంపై దర్యాప్తు చేపట్టిన అనంతరం ఈ అరెస్ట్ జరిగింది. బుధవారం రోలింగ్ మెడోస్‌లోని కుక్ కౌంటీ థర్డ్ మున్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టులో జరిగిన నిర్బంధ విచారణ సందర్భంగా న్యాయమూర్తి నిందితుడిని కస్టడీలో ఉంచాలని ఆదేశించారు. తదుపరి విచారణ అక్టోబర్ 30న జరగనుంది.
నవరాత్రుల సమయంలో..
నవరాత్రి సహా హిందూ పండుగలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే ఒహాయో రాష్ట్రంలోని రిచ్మండ్ హైట్స్‌లో ఉన్న శ్రీ స్వామినారాయణ వడ్తాల్ ధామ్ హిందూ మందిరంపై విధ్వంసక చర్యలు జరిగిన రెండు వారాలకే ఈ ఘటన వెలుగుచూసింది. అక్టోబర్ 11న మౌంట్ ప్రాస్పెక్ట్ పోలీసు విభాగానికి సామూహిక కాల్పులకు సంబంధించిన సంభావ్య ముప్పుపై సమాచారం అందింది. ఈ సమాచారాన్ని అందుకున్న మౌంట్ ప్రాస్పెక్ట్ పోలీసులు పాలటైన్ పోలీసు విభాగాన్ని అప్రమత్తం చేశారు. నిందితుడు పాపోరాకిస్ నుంచి తనకు ఆందోళన కలిగించే ఎలక్ట్రానిక్ సందేశాలు అందాయని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
అరోరా ప్రాంతం లక్ష్యంగా..
దర్యాప్తు అధికారుల వివరాల ప్రకారం.. సామూహిక కాల్పులకు పాల్పడేందుకు రూపొందించినట్లు భావిస్తున్న ఓ పత్రాన్ని నిందితుడు ఇతరులతో పంచుకున్నాడు. రైఫిల్, రైఫిల్ మ్యాగజైన్లు, శరీర రక్షణ కవచం, ఇతర వ్యూహాత్మక పరికరాలకు సంబంధించిన చిత్రాలను కూడా పంపించాడు. ఈ ఆధారాల నేపథ్యంలో అక్టోబర్ 11న అరోరా ప్రాంతంలోని హిందూ ప్రార్థనా మందిరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలని నిందితుడు ప్రణాళిక రూపొందించి ఉంటాడని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అయితే, దాడికి ఉద్దేశించిన నిర్దిష్ట ఆలయం ఏదన్నది ఇంకా నిర్ధారణ కాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. పాలటైన్ పోలీసులు నిందితుడికి సంబంధించిన ఎలక్ట్రానిక్ సందేశాలను, అతను స్వయంగా రూపొందించినట్లు భావిస్తున్న పత్రాన్ని పరిశీలించారు. వై ఐ ఫాట్: ఏకేఏ: (అరోరా షూటర్స్ మానిఫెస్టో) అనే పేరుతో ఉన్న ఆ పత్రంలో శ్వేతజాతి ఆధిపత్య భావజాలం, తీవ్రవాద సిద్ధాంతాలను వ్యక్తం చేసే వ్యాఖ్యలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా దక్షిణాసియా మూలాలున్న ప్రజలు, అందులోనూ భారతీయులపై హింసకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

నిందితుడి నివాసంలో సోదాలు..
పాలటైన్, మౌంట్ ప్రాస్పెక్ట్ పోలీసు విభాగాలు సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టాయి. ఇరు విభాగాల అధికారులు కలిసి అక్టోబర్ 11 సాయంత్రం నిందితుడు తన నివాసం నుంచి బయటకు వస్తున్న సమయంలో అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దర్యాప్తులో భాగంగా అతని నివాసంలో సోదాలు నిర్వహించేందుకు పాలటైన్ పోలీసులు కోర్టు అనుమతితో సెర్చ్ వారెంట్ అమలు చేశారు. ఈ సోదాల్లో ఒక రైఫిల్, లోడ్ చేసిన పలు రైఫిల్ మ్యాగజైన్లు, వందల సంఖ్యలో అదనపు రైఫిల్ తూటాలు, వ్యూహాత్మక పరికరాలు, దర్యాప్తుకు సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో శరీర రక్షణ కవచంతో కూడిన వ్యూహాత్మక జాకెట్ కూడా ఉంది. దానిపై శ్వేతజాతి ఆధిపత్య తీవ్రవాద భావజాలానికి సంబంధించిన గుర్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడి వద్ద ఏఆర్ తరహా రైఫిల్ ఉన్నట్లు కూడా సమాచారం వెలువడింది.
ప్రార్థనా మందిరాలకు సమాచారం..
అరోరా పోలీసు విభాగానికి కూడా పాలటైన్, మౌంట్ ప్రాస్పెక్ట్ పోలీసులు ఈ సంభావ్య ముప్పు గురించి సమాచారం అందించారు. దీంతో అరోరా పోలీసులు తమ పరిధిలోని హిందూ ప్రార్థనా మందిరాల నిర్వాహకులను సంప్రదించి, దాడి కుట్రకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. నిందితుడిపై ఉగ్రవాద బెదిరింపులకు పాల్పడినట్లు ఒక అభియోగం, చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉన్నట్లు మరో అభియోగం నమోదు చేశారు. రెండో అభియోగం ప్రకారం, 16 ఇంచుల కంటే తక్కువ పొడవున్న బ్యారెల్ కలిగిన రైఫిల్‌ను అక్రమంగా కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఈ ఘటనపై స్పందిస్తూ, పోలీసుల వేగవంతమైన చర్యలను అభినందించింది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సంభావ్య ముప్పు గురించి సమాచారం ఉంటే అధికారులకు తెలియజేయాలని సమాజానికి విజ్ఞప్తి చేసింది. భయం లేకుండా ప్రార్థనలు చేసుకునే హక్కు ప్రతి సమాజానికి ఉందని సంస్థ ఎక్స్ వేదికగా పేర్కొంది.
ఇంకా ముప్పు ఉందా..
ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, పాలటైన్ పోలీసు విభాగం ఎఫ్బీఐతో కలిసి పనిచేస్తోందని అధికారులు తెలిపారు. దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా అదనపు అభియోగాలు నమోదు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ప్రజలకు కొనసాగుతున్న ముప్పు ఉన్నట్లు ఎలాంటి సమాచారం లేదని అధికారులు వెల్లడించారు. ఈ ఆరోపణల తీవ్రతను తక్కువగా అంచనా వేయలేమని పాలటైన్ పోలీసు చీఫ్ విలియం నార్డ్ పేర్కొన్నారు. పాలటైన్, మౌంట్ ప్రాస్పెక్ట్ పోలీసు విభాగాలు సమాచారాన్ని తక్షణమే పంచుకుని సమన్వయంతో స్పందించడం వల్ల నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకోవడం సాధ్యమైందని తెలిపారు. ప్రజల భద్రతతోపాటు ప్రార్థనా మందిరాల రక్షణ తమ ప్రాధాన్యమని, దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఇతర పోలీసు విభాగాలతో కలిసి పనిచేస్తామని చెప్పారు.
చురుకుగా పనిచేస్తున్న ఎఫ్‌బీఐ..
తీవ్రవాద భావజాలం నుంచి ప్రేరణ పొందిన హింసాత్మక ముప్పులను గుర్తించడం, దర్యాప్తు చేయడం, అడ్డుకోవడం కోసం స్థానిక, రాష్ట్ర స్థాయి చట్ట అమలు సంస్థలతో కలిసి ఎఫ్‌బీఐ చురుకుగా పనిచేస్తోందని ఎఫ్‌బీఐ చికాగో స్పెషల్ ఏజెంట్ ఇన్చార్జ్ ర్యాన్ వేలెన్ తెలిపారు. మరోవైపు, నిందితుడు గత రెండేళ్లుగా దాడికి సంబంధించిన ప్రణాళికలు రచించి ఉంటాడని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ, నాజీ భావజాలానికి మద్దతు తెలిపేవాడని నిందితుడితో కలిసి పనిచేసిన ఓ సహోద్యోగి వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఈ కోణంలోనూ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | మీ పని మీరు చూసుకోండి.. ఎలాన్ మస్క్‌కు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్..
అక్టోబర్ 10, 2026

Ramchandar Rao | ఎలాన్ మస్క్ ట్వీట్‌తో మోదీపై ఉన్న ఆరోపణలు అబద్దమని రుజువైంది: రాంచందర్‌రావు
అక్టోబర్ 9, 2026

KTR | కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం.. కాలిఫోర్నియా ఆరోగ్య సదస్సుకు ఆహ్వానం
అక్టోబర్ 4, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy | 15 శాతం కమీషన్.. కాంట్రాక్టర్లను బెదిరిస్తున్న సీఎం రేవంత్.. ఆర్వీఎం కన్స్ట్రక్షన్స్ ఎండీ సంచలన ఆరోపణ
- ●IAS Vikas Marmat | బెంగళూరు పబ్‌లో వీరంగం.. కడా సంచాలకుడు, ఐఏఎస్ వికాస్ మర్మత్ బదిలీ
- ●Gold And Silver Prices Today | డాలర్ వీక్నెస్ ఎఫెక్ట్.. బులియన్ మార్కెట్లలో బంగారం జోరు..
- ●YTPS | 15 రోజులుగా షట్‌డౌన్.. వైటీపీఎస్ చీఫ్ ఇంజినీర్‌పై వేటు
- ●Reliance Jio | జియో రీఛార్జ్ ధరలు 12 శాతం పెరిగే ఛాన్స్.. ఎప్పటి నుంచి అంటే?
- ●NIMS | నిమ్స్ ఓపీ సమయం పెంపు.. ఇక మధ్యాహ్నం 2 గంటల వరకు రిజిస్ట్రేషన్లు

Revanth Reddy | 15 శాతం కమీషన్.. కాంట్రాక్టర్లను బెదిరిస్తున్న సీఎం రేవంత్.. ఆర్వీఎం కన్స్ట్రక్షన్స్ ఎండీ సంచలన ఆరోపణ

IAS Vikas Marmat | బెంగళూరు పబ్‌లో వీరంగం.. కడా సంచాలకుడు, ఐఏఎస్ వికాస్ మర్మత్ బదిలీ

Gold And Silver Prices Today | డాలర్ వీక్నెస్ ఎఫెక్ట్.. బులియన్ మార్కెట్లలో బంగారం జోరు..

YTPS | 15 రోజులుగా షట్‌డౌన్.. వైటీపీఎస్ చీఫ్ ఇంజినీర్‌పై వేటు



