త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | డాల‌ర్ వీక్‌నెస్ ఎఫెక్ట్‌.. బులియ‌న్ మార్కెట్ల‌లో బంగారం జోరు..

Gold And Silver Prices Today | ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా త‌గ్గ‌డం, అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో పాజిటివ్ సంకేతాలు రావ‌డం, అమెరికా డాల‌ర్ విలువ త‌గ్గుతుండ‌డం వంటి కార‌ణాల‌తో బులియ‌న్ మార్కెట్ల‌లోనూ జోరు వ‌చ్చింది. వినియోగ‌దారులు సేఫ్ హావెన్ ఆస్తుల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు భారీగా ఆస‌క్తిని చూపిస్తున్నారు.

S

Business | Published On Oct 15, 2026, 10.58 am IST

Gold And Silver Prices Today | డాల‌ర్ వీక్‌నెస్ ఎఫెక్ట్‌.. బులియ‌న్ మార్కెట్ల‌లో బంగారం జోరు..
Advertisement

Gold And Silver Prices Today | ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా త‌గ్గ‌డం, అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో పాజిటివ్ సంకేతాలు రావ‌డం, అమెరికా డాల‌ర్ విలువ త‌గ్గుతుండ‌డం వంటి కార‌ణాల‌తో బులియ‌న్ మార్కెట్ల‌లోనూ జోరు వ‌చ్చింది. వినియోగ‌దారులు సేఫ్ హావెన్ ఆస్తుల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు భారీగా ఆస‌క్తిని చూపిస్తున్నారు. అయితే దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం ధ‌ర‌లు భారీగా త‌గ్గ‌డం గ‌మ‌నార్హం. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర ఈ సెష‌న్‌లో 0.96 శాతం ఎగ‌బాకి 4,143 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.55 శాతం పెరిగి 55 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1,555 పాయింట్లు ఎగ‌సి 1,47,403 వ‌ద్ద ఉండగా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 643 పాయింట్లు పెరిగి 2,08,981 వ‌ద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర ఒక్క రోజులోనే రూ.8వేల‌కు పైగా త‌గ్గ‌గా, వెండి ధ‌ర‌లోనూ భారీగా త‌గ్గుద‌ల న‌మోదైంది.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,744 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,17,952 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,47,440 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,74,400 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.8,200 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,515 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,08,120గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,35,150 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,51,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,500 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,058 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.88,464గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,10,580 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,05,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,100 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,30,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,300గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర కిలోకు రూ.5వేలు త‌గ్గింది. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,40,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,400 గా ఉంది.

Advertisement
Advertisement