త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NIMS | నిమ్స్ ఓపీ స‌మ‌యం పెంపు.. ఇక మధ్యాహ్నం 2 గంటల వరకు రిజిస్ట్రేషన్లు

NIMS | హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిమ్స్ (NIMS) దవాఖానలో రోగుల‌కు ఊర‌ట ల‌భించింది. ఇక‌పై మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఔట్‌పేషెంట్‌ (ఓపీ) రిజిస్ట్రేషన్ (OP Registration) చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టివ‌ర‌కు ఉద‌యం 8 నుంచి 11 గంట‌ల వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్ స‌దుపాయం అందుబాటులో ఉంది.

G

Telangana | Published On Oct 15, 2026, 10.26 am IST

NIMS | నిమ్స్ ఓపీ స‌మ‌యం పెంపు.. ఇక మధ్యాహ్నం 2 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Advertisement

NIMS | త్రినేత్ర న్యూస్‌: హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిమ్స్ (NIMS) దవాఖానలో రోగుల‌కు ఊర‌ట ల‌భించింది. ఇక‌పై మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఔట్‌పేషెంట్‌ (ఓపీ) రిజిస్ట్రేషన్ (OP Registration) చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టివ‌ర‌కు ఉద‌యం 8 నుంచి 11 గంట‌ల వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్ స‌దుపాయం అందుబాటులో ఉంది. అయితే దూర‌ప్రాంతాల నుంచి వ‌చ్చే రోగుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా ఓపీ రిజిస్ట్రేష‌న్ సమయాన్ని మ‌రో మూడు గంట‌లు (Timings Extended) పొడిగించారు. దీంతో వైద్యులు కూడా సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారు.

అదేవిధంగా కొన్ని కీలకమైన వైద్య పరీక్షల నివేదికలకు, స్పెషలిస్టుల అపాయింట్‌మెంట్ (Specialist Appointments) కోసం నిరీక్షణకు సైతం అధికారులు చెక్‌ పెట్టారు. ఓపీలో రిజిస్ట్రేషన్‌ అయిన రోజే ఎంఆర్‌ఐ (MRI) మినహా ఇతర అన్ని రకాల వైద్యపరీక్షలు (Medical Tests) నిర్వహించేలా ఆదేశాలు జారీచేశారు. వైద్య ప‌రీక్ష‌ల నివేదిక‌లు ఒక‌టి, రెండు గంట‌ల్లోనే నివేదిక‌లు వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. దీంతో వాటిని వైద్యులకు చూపించి, అదేరోజు చికిత్స పొందే వెసులుబాటు లభించింది.

Advertisement
Advertisement