US Iran War Cost | ఇరాన్‌తో యుద్ధం: రోజుకు 8220 కోట్లు దహించేస్తున్న అగ్రరాజ్యం.. డోంట్ కేర్ అంటున్న ట్రంప్!
యుద్ధం అంటే కేవలం ప్రాణ నష్టం, ఆస్తి నష్టమే కాదు.. ఆ యుద్ధం చేయడానికి ప్రభుత్వాలు తమ ఖజానాను ఖాళీ చేయాల్సిందే. యుద్ధం ముందుకెళ్లాలంటే ప్రజలు కట్టిన ట్యాక్స్‌నే ఆయుధాల తయారీకి వాడాలి. ఇప్పుడు అమెరికా అదే చేస్తోంది. ఇరాన్‌తో తలపడటం కోసం వేల కోట్లను నీళ్లలా ఖర్చు చేస్తోంది.
International | Published On Mar 9, 2026, 6.14 pm IST
US Iran War Cost | త్రినేత్ర.న్యూస్ : అమెరికా - ఇరాన్ మధ్య రగులుతున్న యుద్ధం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా మారుతోంది. కేవలం వారం రోజుల్లోనే పలు చిన్న దేశాల వార్షిక జీడీపీ (GDP) కంటే ఎక్కువ మొత్తాన్ని అమెరికా ఈ యుద్ధం కోసం ఖర్చు చేసింది. రోజుకు అక్షరాలా 891 మిలియన్ డాలర్ల (సుమారు రూ.8,220 కోట్లు) నిధులను అగ్రరాజ్యం మంచినీళ్లలా ఖర్చు చేస్తోందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందేనని భీష్మించుకుని కూర్చున్నారు.
US Iran War Cost | వారం రోజుల్లోనే 6 బిలియన్ డాలర్ల ఖర్చు
యుద్ధం మొదలైన మొదటి వారంలోనే సుమారు 6 బిలియన్ డాలర్లు(రూ.55,370 కోట్లు) ఖర్చయినట్లు పెంటగాన్ (Pentagon) అమెరికా కాంగ్రెస్‌కు తెలిపింది. ఈ నేపథ్యంలో ట్రంప్ యంత్రాంగం యుద్ధం కోసం అదనపు నిధులను కోరే అవకాశం ఉందని రిపబ్లికన్లు భావిస్తున్నారు. వాషింగ్టన్‌కు చెందిన 'సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్' (CSIS) అంచనా ప్రకారం, అమెరికా వేస్తున్న బాంబులు, మోహరించిన ఆయుధ సంపత్తి ఆధారంగా.. రోజువారీ ఖర్చు 891.4 మిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. మొదటి వారంలో కేవలం క్షిపణులను అడ్డుకునే ఇంటర్‌సెప్టర్ల (Interceptors) కోసమే సుమారు 4 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు.
గత వేసవిలో ఇరాన్ అణు కేంద్రాలపై చేసిన 'ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్' (Operation Midnight Hammer) ఖర్చుతో పోలిస్తే.. ప్రస్తుత యుద్ధం తొలి 100 గంటల్లోనే దానికి మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేసింది.
రోజువారీ ఖర్చుల లెక్కలు (Breakdown)
CSIS నివేదిక ప్రకారం అమెరికా రోజువారీ సైనిక ఆపరేషన్ల ఖర్చు ఈ విధంగా ఉంది.
గగనతల దాడులకు: రోజుకు 30 మిలియన్ డాలర్లు
నావికా దళ ఆపరేషన్లకు: రోజుకు 15 మిలియన్ డాలర్లు
భూతల ఆపరేషన్లకు: రోజుకు 1.6 మిలియన్ డాలర్లు
ఈ యుద్ధం కోసం పశ్చిమాసియాలో అమెరికా ఏకంగా 50,000 మందికి పైగా సైనికులను, రెండు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లను, డజనుకు పైగా యుద్ధనౌకలను మోహరించింది.
భారత అంతరిక్ష బడ్జెట్ కంటే ఎక్కువే..
అమెరికా చేస్తున్న ఈ ఖర్చు ఎంత భారీగా ఉందంటే..
భారత్ : ఇస్రో (ISRO) వార్షిక బడ్జెట్ మొత్తాన్ని అమెరికా కేవలం రెండు రోజుల్లో తగలేస్తోంది.
పాకిస్థాన్: పాకిస్థాన్ మొత్తం వార్షిక రక్షణ బడ్జెట్.. ఈ యుద్ధంలో కేవలం 10 రోజుల్లో పూర్తవుతుంది.
నాసా (NASA): అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వార్షిక బడ్జెట్ (24.4 బిలియన్లు డాలర్లు) కూడా ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే నెల రోజుల్లో ఖర్చయిపోతుంది.
ఇరాన్ వ్యూహం: 'ఆపరేషన్ మ్యాడ్‌మెన్'
ఇరాన్ కూడా దీటుగా బదులిస్తోంది. తక్కువ ఖర్చయ్యే 'షాహెద్ డ్రోన్లను' (Shahed drones) ప్రయోగిస్తూ.. అమెరికా చేత అత్యంత ఖరీదైన ఇంటర్‌సెప్టర్లను వాడేలా చేస్తోంది. 'ఆపరేషన్ మ్యాడ్‌మెన్' (Operation Madman) వ్యూహంతో అమెరికా, ఇజ్రాయెల్, వాటి మిత్రదేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయాలని ఇరాన్ భావిస్తోంది.
చమురు మంటలు
ఇరాన్ దాడుల దెబ్బకు గ్లోబల్ ట్రేడ్ స్వరూపం మారుతోంది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (Strait of Hormuz) వద్ద వాణిజ్యం నిలిచిపోయింది. ఖతార్ నుంచి గ్యాస్ ఎగుమతులు ఆగిపోయాయి. సౌదీ అరేబియాలోని 'రాస్ తనురా' రిఫైనరీ తాత్కాలికంగా మూతపడింది. దీని ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ (Brent Crude) బ్యారెల్ ధర రికార్డు స్థాయిలో 119.50 డాలర్లకు చేరుకుంది. అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో ఇంధన ధరలు మండిపోతున్నాయి.
ట్రంప్ ఏమంటున్నారు?
ఇంత జరుగుతున్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. "ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే" అని ఆయన తెగేసి చెబుతున్నారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్' (Truth Social) లో స్పందిస్తూ.. "ఇరాన్‌ను నాశనం అంచు నుంచి వెనక్కి తీసుకువస్తాను. దాన్ని మునుపటి కంటే ఆర్థికంగా బలంగా, గొప్పగా మారుస్తాను" అని చెబుతూ, "మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్" (Make Iran Great Again) అనే నినాదాన్ని అందుకున్నారు.
అయితే, 2012, 2017లో మిడిల్ ఈస్ట్ యుద్ధాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. సొంత పార్టీ నేతలు, డెమొక్రాట్లు ఆయన తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒకవైపు పౌరుల ఆరోగ్య, ఆహార పథకాలకు కోతలు విధిస్తూ.. మరోవైపు యుద్ధాల కోసం బిలియన్ల కొద్దీ పన్నుల డబ్బును మధ్యప్రాచ్యానికి తరలిస్తున్నారని మండిపడుతున్నారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






