త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Elections | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. ప్రారంభ‌మైన‌ పోలింగ్‌

Municipal Elections | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల (Municipal Elections) పోలింగ్ ప్రారంభ‌మైంది. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు సాగ‌నుంది. 13 న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లు, 79 మున్సిపాలిటీల్లో మొత్తం 10,262 మంది పోటీ చేస్తున్నారు.

G

Andhra pradesh | Published On Nov 1, 2026, 7.38 am IST

Municipal Elections | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. ప్రారంభ‌మైన‌ పోలింగ్‌
Advertisement

Municipal Elections | త్రినేత్ర న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల (Municipal Elections) పోలింగ్ ప్రారంభ‌మైంది. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు సాగ‌నుంది. 13 న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లు, 79 మున్సిపాలిటీల్లో మొత్తం 10,262 మంది పోటీ చేస్తున్నారు. 99,36,014 మంది వీరి భ‌విత‌వ్యాన్ని తేల్చ‌నున్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా 11,378 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. 13 కార్పొరేష‌న్ల‌లో మేయ‌ర్ ప‌ద‌వుల‌కు 153 మంది, 804 డివిజ‌న్ల‌లో 3,073 మంది పోటీలో ఉన్నారు. ఇక 79 మున్సిపాలిటీలు, న‌గ‌ర పంచాయ‌తీల చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌వుల‌కు 367 మంది, 2,382 వార్డు కౌన్సిల‌ర్ ప‌ద‌వుల‌కు 6,669 మంది బ‌రిలో నిలిచారు. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

పోలింగ్ స‌ద‌ర్భంగా ఎలాంటి అవాంఛ‌నీ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 36,351 మంది సిబ్బందిని మోహ‌రించారు. ఇక ఎన్నికల విధుల్లో 1,449 మంది ఆర్వోలు, 2,543 మంది స‌హాయ రిట‌ర్నింగ్ అధికారులు, 13,504 మంది ప్రిసైడింగ్ అధికారులు, 13,504 మంది ప్రిసైడింగ్ అధికారులు, 13,504 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 51,716 మంది ఇత‌ర పోలింగ్ అధికారులు, 3,720 మంది మైక్రో అబ్జ‌ర్వ‌ర్లు, 1835 మంది వెబ్‌కాస్టింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు.

 

ట్యాగ్స్:

Andhra PradeshAP Municipal ElectionsMunicipal ElectionsPolling
Advertisement
Advertisement