US Visa | వలసలపై ట్రంప్ సర్కార్ కొరడా.. ఏడాదిలోనే మూడు లక్షల వీసాలు రద్దు..!
US Visa | అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే ఏకంగా 3 లక్షలకు పైగా వీసాలను (US Visa) రద్దు చేసినట్లు ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.
US Visa | త్రినేత్ర న్యూస్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వలసలపై కొరడా ఝుళిపిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే ఏకంగా 3 లక్షలకు పైగా వీసాలను (US Visa) రద్దు చేసినట్లు ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. రద్దు చేసిన వీసాల్లో సుమారు 4,000 వీసాలు బర్త్ టూరిజంకు (birth tourism) సంబంధించినవి కావడం గమనార్హం. నేర కార్యకలాపాలు, ప్రజా భద్రతకు ముప్పు, మోసం, తప్పుడు సమాచారంతో కూడిన వలస ఉల్లంఘనల కారణంగానే ఈ వీసాలను రద్దు చేసినట్లు సదరు నివేదిక పేర్కొంది. అయితే, ఏ దేశానికి చెందిన వారి వీసాలు రద్దయ్యాయన్నది మాత్రం సదరు నివేదిక వెల్లడించలేదు.
చరిత్రలోనే అత్యంత వేగంగా వీసాల రద్దు: టామీ పిగోట్
అమెరికా చరిత్రలోనే గత ప్రభుత్వాలు చేయని విధంగా ట్రంప్ యంత్రాంగం అత్యంత వేగంగా, అత్యధిక సంఖ్యలో వీసాలను రద్దు చేసినట్లు స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి టామీ పిగోట్ (Tommy Pigott) తెలిపారు. "300,000లకు పైగా వీసాల రద్దుతో.. ట్రంప్ యంత్రాంగం చరిత్రలోనే ఏ ఇతర ప్రభుత్వ యంత్రాంగం చేయని విధంగా అత్యంత వేగంగా వీసాలను రద్దు చేసింది. చట్టాన్ని ఉల్లంఘించే, మోసాలకు పాల్పడే లేదా దేశ భద్రతకు భంగం కలిగించే వీసాదారుల పట్ల మా ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోంది" అని స్పష్టం చేశారు.
నివేదికల ప్రకారం.. గతేడాది ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి (2025, జనవరి) ఈ ఏడాది ఆగస్టు వరకూ తొలి 18 నెలల్లోనే ఏకంగా 1.75 లక్షల వీసాలు రద్దయ్యాయి. 2026 సెప్టెంబర్ చివరి నాటికి ఆ సంఖ్య 2.5 లక్షలకు చేరింది. ఆ తర్వాత అక్టోబర్ నాటికి ఆ సంఖ్య 3 లక్షల మార్క్‌ను దాటడం గమనార్హం.
Also Read..
2029 నాటికి డ్రగ్స్ రహిత భారతే లక్ష్యం : అమిత్ షా
జియో ఐపీఓకు రికార్డు స్థాయిలో స్పందన.. 100 నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రిప్షన్..
సంబంధిత వార్తలు

Donald Trump | మాక్రాన్ వల్లే ఈ పరిస్థితి.. పారిస్ ఒక ముస్లిం నగరంగా మారబోతోంది : ట్రంప్
అక్టోబర్ 20, 2026

Donald Trump Russia Ukraine War | రష్యాపై ఆ సంతకం అందుకే ఆపేశా.. యుద్ధం ఆపడం జెలెన్స్కీకి ఇష్టం లేదు
అక్టోబర్ 19, 2026

Israeli PM Netanyahu | అమెరికా అధ్యక్షుడితో ఇజ్రాయెల్‌కు ముప్పు.. భారత్‌తో సంబంధాలు చాలా అవసరం : నెతన్యాహు
అక్టోబర్ 19, 2026
తాజావార్తలు
- ●Suicide | కుషాయిగూడలో విషాదం.. హోటల్ గదిలో యువకుడు ఆత్మహత్య
- ●Hyderabad Metro New Coaches | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రూ.923 కోట్లతో 60 కొత్త కోచ్‌లు.. ఇక పీక్ అవర్స్ రద్దీకి చెక్
- ●Traffic Restrictions | హైదరాబాద్‌లో 3 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..
- ●Amit Shah | 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతే లక్ష్యం : అమిత్ షా
- ●SBI | ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. డార్క్ వెబ్‌లో డేటా.. స్పందించిన బ్యాంక్..
- ●Naga Chaitanya | రిలీజ్ డేట్ చెప్పేశారు - షూటింగ్ మాత్రం పెండింగ్ - నాగచైతన్య వృషకర్మపై అప్డేట్

Suicide | కుషాయిగూడలో విషాదం.. హోటల్ గదిలో యువకుడు ఆత్మహత్య

Hyderabad Metro New Coaches | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రూ.923 కోట్లతో 60 కొత్త కోచ్‌లు.. ఇక పీక్ అవర్స్ రద్దీకి చెక్

Traffic Restrictions | హైదరాబాద్‌లో 3 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..

Amit Shah | 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతే లక్ష్యం : అమిత్ షా



