త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ప‌ట్ట‌భ‌ద్రులు త‌మ పేర్ల‌ను ఓట‌ర్లుగా న‌మోదుచేసుకోవాలి: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Ponnam Prabhakar | ప‌ట్ట‌భ‌ద్రుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్న‌ద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు. రాబోయే ప‌ట్ట‌భ్ర‌దుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు గ్రాడ్యుయేట్లు (Graduates) అంతా త‌మ పేర్ల‌ను ఓట‌ర్లుగా న‌మోదుచేసుకోవాల‌ని చెప్పారు.

G

Hyderabad | Published On Oct 23, 2026, 1.20 pm IST

Ponnam Prabhakar | ప‌ట్ట‌భ‌ద్రులు త‌మ పేర్ల‌ను ఓట‌ర్లుగా న‌మోదుచేసుకోవాలి: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్‌: ప‌ట్ట‌భ‌ద్రుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్న‌ద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు. రాబోయే ప‌ట్ట‌భ్ర‌దుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు గ్రాడ్యుయేట్లు (Graduates) అంతా త‌మ పేర్ల‌ను ఓట‌ర్లుగా న‌మోదుచేసుకోవాల‌ని చెప్పారు. నవంబర్ 6 వ తేదీ వరకు పట్టభద్రుల ఓటరు నమోదు చేసుకోవచ్చు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోని టీచ‌ర్స్ కాల‌నీలో నిర్వ‌హించిన పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ (Azharuddin), ఎమ్మెల్యే శ్రీ గణేశ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శ్రీ గణేశ్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ ప్రాంతంలో అర్హత గల పట్టభద్రుల ఓట్లు నమోదు కార్యక్రమం చేపట్టామ‌న్నారు.

అర్హత కలిగిన పట్టభద్రులందరి ఓట్లను నమోదు చేయించడానికి అన్ని ప్రాంతాల్లో క్యాంప్‌లు నిర్వహిస్తున్నామ‌ని చెప్పారు. పట్టభద్రుల సమస్యలను గళమెత్తే శక్తి ఉన్న యువకుడు, సామ రామోహన్ రెడ్డిని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిందని వెల్ల‌డించారు. నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, న్యాయవాదులు, డాక్టర్లు తదితర పట్టభద్రులందరి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ (Congress Praty) పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఓటు హక్కును కాపాడేందుకు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నార‌ని, ప్రతి గ్రాడ్యుయేట్ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement