Sing Geetham Review | సింగ్ గీతం రివ్యూ – మాటల్లేవ్… సినిమా మొత్తం పాటలే – విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ రోల్!
94 ఏళ్ల వయసులో సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన మూవీ సింగ్ గీతం శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకలు ముందుకొచ్చింది. కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Entertainment | Published On Jun 12, 2026, 11.17 am IST
Sing Geetham Review | 94 ఏళ్ల వయసులో సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు మెగాఫోన్ పట్టి సింగ్ గీతం సినిమాను తెరకెక్కించారు. మాటలు లేకుండా కేవలం పాటలతోనే ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను ప్రభాస్ కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించారు. అయాన్, అహిల్య బమ్రూ, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. శుక్రవారం సింగ్ గీతం థియేటర్లలో రిలీజైంది. సింగీతం శ్రీనివాసరావు చేసిన ఈ ప్రయోగం తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే?
కుబేరం పురం కథ...
కుబేరపురంలో గోల్డ్ మైన్స్ ఉంటాయి. ఊరంతా ఆ మైన్స్‌పైనే ఆధారపడి బతుకుతుంటారు. ఆ ఊరికి భోపాల్ సెంట్రల్ జైలు నుంచి రిలీజైన ప్రతాప్ (అయాన్) వస్తాడు. అనాథ అనుకున్న ప్రతాప్‌కు తన తండ్రి కుబేరపురంలోని గోల్డ్‌మైన్‌కు ఓనర్ అనే నిజం తెలుస్తుంది. ఆ మైన్స్‌లోని గోల్డ్‌ను వెలికితీసి బాగా డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు. ప్రతాప్‌తో పాటు రేణు (శాలిని) తండ్రికి కూడా గోల్డ్‌మైన్స్‌లో వాటా ఉంటుంది. ఒకప్పుడు పచ్చదనంతో నిండిపోయిన ఆ ఊరు బంగారం మైన్స్ కారణంగా ఏడారిలా మారిపోతుంది. ఊరు మొత్తానికి ఒక్కటే ఒక్క చెట్టు మిగిలిపోతుంది. ఆ చెట్టు గౌరి (అహిల్య) కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. అనుకోకుండా ఆ ఊరికి కుబేరుడు ఓ శాపం పెడతాడు. అదేమిటి? ఊరివాళ్లంతా మాటలను కూడా పాటల్లా పాడటానికి కారణం ఏమిటి? గౌరి పరిచయం ప్రతాప్‌లో మార్పు తీసుకొచ్చిందా? కుబేరుడి సాయంతో ఆ ఊరిని గౌరి ఎలా కాపాడింది? ఓ గోల్డ్ మైన్స్ కథేంటి? ఆ ఊరిలో మళ్లీ చెట్లు మొలిచాయా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
మొత్తం పాటలే....
పాటలు లేకుండా తెలుగు సినిమాను ఊహించలేము. పాటలతోనే హిట్టయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఓ సినిమాలో ఐదు నుంచి ఆరు వరకు సాంగ్స్ ఉండటం కామన్. కానీ అసలు మాటలే లేకుండా సినిమా మొత్తం పాటలతోనే రూపొందిస్తే ఎలా ఉంటుందో ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే సింగ్ గీతం చూడాల్సిందే.పేరుకు ప్రయోగమే కానీ ఇందులో లవ్, కామెడీ, మెసేజ్...ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి.
మైనింగ్ పేరుతో పర్యావరణాన్ని మానవాళి ఎలా నాశనం చేస్తున్నారు? భవిష్యత్ తరాలకు ఏ విధంగా చేటు చేస్తున్నారనే మెసేజ్‌ను ఇచ్చారు. ప్రకృతిని నాశనం చేసుకుంటూ పోతే భూమిపై చివరకు చెట్టు అన్నదే మిగలదనే చూపించారు.
కుబేరుడి శాపం...
సినిమాల్లో పూర్తిగా మాటలు లేవని కాదు. తొలి ఇరవై నిమిషాలు డైలాగ్స్‌తోనే సినిమా సాగుతుంది. హీరోహీరోయిన్లతో పాటు కుబేర పురాన్ని రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో మాదిరిగానే పరిచయం చేశారు డైరెక్టర్. కుబేరుడి శాపం ఎప్పుడైతే మొదలవుతుందో అక్కడి నుంచే ఈ సినిమా మొత్తం పాటలతో సాగుతుంది. ఈ పాటల ప్రహాసనంలో కొన్ని నవ్విస్తాయి. మరికొన్ని మనసుకు హాయినిస్తాయి. అయితే అన్ని ఎమోషన్స్‌ను పాటల్లో చెప్పాడం సాధ్యం కాదు. దాంతో బలవంతంగా పాటలను కథలో ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. ఓ స్టేజ్ దాటిన తర్వాత ఈ పాటల గోల ఆగితే బాగుండునని అనిపిస్తుంది.
విజయ్ దేవరకొండ గెస్ట్...
పాటల సినిమాలోనూ తనదైన మార్కు ఎమోషన్స్‌తో సింగీతం చాలా వరకు మ్యాజిక్ చేశారు. సింగ్ గీతం సినిమా చూడటానికి థియేటర్లకు వచ్చిన ఆడియెన్స్‌ను గెస్ట్ పాత్రలో మేకర్స్ సర్‌ప్రైజ్ చేశారు. విజయ్ దేవరకొండ ఎంట్రీ మంచి జోష్ ఇస్తుంది. నివేథా పేతురాజ్, రాహుల్ రవీంద్రన్ కూడా అతిథులుగా కనిపిస్తారు. ఊరి ఫ్లాష్‌బ్యాక్, క్లైమాక్స్‌ను కన్వీన్సింగ్‌గా ముగించిన తీరు బాగున్నాయి.
నాచురల్ యాక్టింగ్...
అయాన్, అహిల్యా బమ్రూలకు తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ. నాచురల్ యాక్టింగ్‌తో మెప్పించారు. సినిమాలో తమ పాటలను తామే పాడుకున్నారు. పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ రోల్‌లో శాలిని కొండెపూడి నటన బాగుంది. తులసి, బెనర్జీ, రచ్చ రవి, మహేష్ ఆచంటతో పాటు మిగిలిన వారి నటన ఒకే.
దేవిశ్రీప్రసాద్ రియల్ హీరో...
ఈ సినిమాకు మెయిన్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్. అతడు లేకుండా సింగ్ గీతం లేదు. తన సంగీతంతోనే రెండు గంటల పదిహేడు నిమిషాలు ఆడియెన్స్‌ను థియేటర్‌లో కూర్చోబెట్టడంతో దేవిశ్రీప్రసాద్ సక్సెస్ అయ్యారు. నాగ్ అశ్విన్ ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. ఇలాంటి ప్రయోగాలు కమర్షియల్‌గా వర్కవుట్ కావడం కష్టమే. రిస్క్ అని తెలిసి ఈ సినిమా నిర్మాణానికి సిద్ధం కావడం ఓ సాహసమే. కొన్ని చోట్ల రాజీ పడ్డారు. సింగ్ గీతం అనే టైటిల్‌ను డైరెక్టర్ కోసమే ఈ సినిమాకు పెట్టారు. ఆ టైటిల్‌కు కథకు సంబంధం ఉండదు.
సింగ్ గీతం తెలుగులో సినిమాల్లో ఓ డిఫరెంట్ అటెంప్ట్. కొత్తదనాన్ని కోరుకునే వారిని ఈ సినిమా మెప్పిస్తుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nag Ashwin | ప్రీ రిలీజ్ ఈవెంట్లో కింద కూర్చున్న నాగ్ అశ్విన్ – కల్కి డైరెక్టర్ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా
జూన్ 7, 2026

Yellamma Movie | ఎల్లమ్మ కు హీరోయిన్ దొరికేదెప్పుడో? – తెరపైకి మలయాళ బ్యూటీ పేరు!
మే 28, 2026

Devi Sri Prasad | ఎల్లమ్మ సినిమా చేయడానికి స్ఫూర్తి ఇదే – వీడియో షేర్ చేసిన దేవిశ్రీప్రసాద్
మే 26, 2026
తాజావార్తలు
- ●Pawan Kalyan | అప్డేట్తోనే ఓజీ 2 రికార్డులు - పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ క్రేజ్ మామూలుగా లేదుగా!
- ●TMC | సయోని ఘోష్, యూసుఫ్ పఠాన్.. ఎన్డీయేకి మద్దతిస్తూ సంతకాలు చేసిన టీఎంసీ ఎంపీలు వీళ్లే..!
- ●FIFA World Cup | ఫిఫా వరల్డ్ కప్ కల.. వదిలేసుకున్న భారత్..
- ●Jaspal Rana | షూటర్ మను బాకర్ కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత
- ●Donald Trump | ఇరాన్‌తో డీల్ కుదిరింది.. త్వరలోనే సంతకాలు.. ట్రంప్ కీలక ప్రకటన
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

Pawan Kalyan | అప్డేట్తోనే ఓజీ 2 రికార్డులు - పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ క్రేజ్ మామూలుగా లేదుగా!

TMC | సయోని ఘోష్, యూసుఫ్ పఠాన్.. ఎన్డీయేకి మద్దతిస్తూ సంతకాలు చేసిన టీఎంసీ ఎంపీలు వీళ్లే..!

FIFA World Cup | ఫిఫా వరల్డ్ కప్ కల.. వదిలేసుకున్న భారత్..

Jaspal Rana | షూటర్ మను బాకర్ కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత



