త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heat Deaths Across Europe | భానుడి భ‌గ‌భ‌గ‌లు.. 50 వేల మంది మృత్యువాత‌.. వాతావరణ మార్పులే కారణమంటున్న ప‌రిశోధ‌కులు

Heat Deaths Across Europe | అధిక ఉష్ణోగ్ర‌త‌ల‌కు ఐరోపా దేశాల్లో 50 వేల మంది మృత్యువాత (Heat Deaths Across Europe) ప‌డ్డారు. మానవ తప్పిదాల వ‌ల్ల వాతావ‌ర‌ణంలో వ‌చ్చిన మార్పులే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తాజా అధ్య‌య‌నం వెల్ల‌డించింది.

D

International | Published On Oct 23, 2026, 11.38 am IST

Heat Deaths Across Europe | భానుడి భ‌గ‌భ‌గ‌లు.. 50 వేల మంది మృత్యువాత‌.. వాతావరణ మార్పులే కారణమంటున్న ప‌రిశోధ‌కులు
Advertisement

Heat Deaths Across Europe | త్రినేత్ర న్యూస్ : భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు ఐరోపా (Europe) దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ ఏడాది వేస‌విలో బ్రిట‌న్‌, ఇట‌లీ, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జ‌ర్లాండ్‌, స్పెయిన్ దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. యూర‌ప్ ఖండం అంత‌టా వేస‌వికాలంలో న‌మోదైన అధిక ఉష్ణ‌గ్ర‌తల కార‌ణంగా ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సంభవించిన తీవ్రమైన వడగాల్పులకు 50 వేల మందికిపైగా ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు.

ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం వల్ల 50,391 మంది మరణించిన‌ట్లు తాజా అధ్య‌య‌నం వెల్ల‌డించింది. ఇందులో దాదాపు మూడింట రెండు వంతుల మరణాలకు మానవ తప్పిదాల వ‌ల్ల వాతావ‌ర‌ణంలో వ‌చ్చిన మార్పులే ( human activity as the primary cause) ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని స‌ద‌రు అధ్య‌య‌నం నివేదించింది. బొగ్గు, చమురు, గ్యాస్ తదితర శిలాజ ఇంధనాల దహనం వల్ల పెరిగిన అదనపు వేడి కారణంగా 32,619 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. వడగాల్పుల ధాటికి ఇటలీలో అత్యధికంగా 13,303 మంది మరణించగా, ఫ్రాన్స్ (7,268), స్పెయిన్ (6,824), జర్మనీ (6,340), బ్రిటన్ (4,354) దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

గ‌తంతో పోలిస్తే 70 శాతం అధికం..

గతంలో అత్యధిక మరణాలు నమోదైన వేసవి కాలంతో పోలిస్తే ఇది 71% ఎక్కువ అని స‌ద‌రు నివేదిక వివ‌రించింది. 2022లో అత్యధికంగా 29,480 మంది మరణించిన‌ట్లు పేర్కొంది. జూన్ 17 నుంచి జూలై 1 వరకు తీవ్రమైన వడగాల్పులు వీచాయని, ఆ సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5.3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయని స‌ద‌రు నివేదిక తెలిపింది. యూరప్‌లో వేడి వడగాల్పుల వల్ల మరణించిన వారిలో సగానికి పైగా 85 ఏళ్లు లేదా అంత‌కంటే ఎక్కువ వ‌య‌స్సు ఉన్న వారేన‌ని వివ‌రించింది. తీవ్ర ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక 65 ఏళ్ల లోపు వారు కూడా దాదాపు 6,000 మంది చనిపోయిన‌ట్లు తెలిపింది.

అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఐరోపా

ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ (global warming), శిలాజ ఇంధనాల కాలుష్యం కారణంగా ఐరోపా ఖండం మిగ‌తా ప్రాంతాల కంటే అత్యంత వేగంగా వేడెక్కుతోంద‌ని లండన్ ఇంపీరియల్ కాలేజ్ పరిశోధకురాలు క్లైర్ బార్న్స్ హెచ్చ‌రించారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల సంభవిస్తున్న వేడి మరణాలు 2000ల ప్రారంభంలో సుమారు 45%గా ఉండగా.. ప్రస్తుతం అది 65%కి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్కిటిక్ మినహా యూరప్ అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండమని చెప్పారు. చాలా వ‌ర‌కూ శిలాజ ఇంధ‌నాల ద‌హ‌నం వంటి మాన‌వ కార్య‌క‌లాపాల వ‌ల్ల వ‌స్తున్న ఈ అంత‌ర్గ‌త వేడి.. మ‌న ఉష్ణోగ్ర‌త‌ల‌ను కొంచెం కొంచెంగా పెంచుతూ వస్తోంద‌న్నారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. అదే స‌మ‌యంలో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను తట్టుకునేలా అక్కడి మౌలిక వసతులను మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని హెచ్చ‌రించారు. కేవలం పరిస్థితులకు అలవాటు పడటం ఒక్కటే పరిష్కారం కాదని.. సమస్య మూలాలపై దృష్టి పెట్టాలని ప‌రిశోధ‌కులు సూచిస్తున్నారు.

Also Read..

సీనియర్ అధికారిపై ఇద్ద‌రు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు ఫిర్యాదు.. ప‌ట్టించుకోని కేబినెట్ కార్య‌ద‌ర్శి

నాడు సిగాచి.. నేడు సరాక.. కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం: హ‌రీశ్ రావు

టేకాఫ్ అయిన 5 నిమిషాల‌కే ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌.. ఎయిర్‌ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం

Advertisement

తాజావార్తలు

Advertisement