త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | టాలీవుడ్‌కు బిగ్ రిలీఫ్ – సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీల‌క తీర్పు

టాలీవుడ్ వ‌ర్గాల‌ను సుప్రీంకోర్టు తీపిక‌బురు వినిపించింది. తెలంగాణ‌లో సినిమా టికెట్ రేట్ల‌కు సంబంధించిన జీవోల‌ను 90 రోజుల ముందే జారీ చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఉస్తాద్‌భ‌గ‌త్‌సింగ్‌, పెద్దితో పాటు ప‌లు సినిమాల‌కు లాభం చేకూర‌నుంది.

N

Entertainment | Published On Mar 13, 2026, 2.59 pm IST

Tollywood | టాలీవుడ్‌కు బిగ్ రిలీఫ్ –  సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీల‌క తీర్పు
Advertisement

Tollywood | టాలీవుడ్ వ‌ర్గాల‌కు సుప్రీంకోర్టు గుడ్‌న్యూస్ వినిపించింది. సినిమా టికెట్ రేట్ల పెంపుపై కీల‌క తీర్పు ఇచ్చింది. తెలంగాణ‌లో సినిమా టికెట్ రేట్ల పెంచాలంటే విడుదల‌కు 90 రోజుల ముందే జీవో జారీ చేయాల‌ని గ‌తంలో హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. 90 రోజుల నిబంధ‌న‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌పై తాజాగా సుప్రీంకోర్టు స్టేను విధించింది.

మైత్రీ మూవీ మేక‌ర్స్‌...

90 రోజుల నిబంధ‌న‌ను స‌వాల్ చేస్తూ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఒక్కోసారి సినిమా షూటింగ్‌ 90 రోజుల్లో పూర్తవుతుందని, అలాంట‌ప్పుడు 90 రోజుల ముందే ధరలు ఖరారు చేయడం ఎలా సాధ్య‌మ‌వుతుంద‌ని త‌మ పిటిష‌న్‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్ పేర్కొన్న‌ది. ఈ నిబంధ‌న వ‌ల్ల పెద్ద సినిమాల‌కు న‌ష్టం వాటిల్ల‌డ‌మే కాకుండా రిలీజ్ డేట్స్ విష‌యంలో ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ త‌ర‌ఫు లాయ‌ర్లు వాదించారు. నిర్మాత‌ల వాద‌న‌ల‌తో ఏకీభ‌వించిన సుప్రీం కోర్టు శుక్ర‌వారం వారికి అనుకూలంగా తీర్చు ఇచ్చింది. సుప్రీంకోర్టు స్టేతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్‌ భ‌గ‌త్‌సింగ్‌తో పాటు వేస‌విలో రిలీజ్ కానున్న పెద్ది, విశ్వంభ‌ర వంటి ప‌లు సినిమాల‌కు బెనిఫిట్ కానుంది. 90 రోజుల నిబంధ‌న ర‌ద్దు కావ‌డంతో పాత ప‌ద్ద‌తిలోనే తెలంగాణ‌లో టికెట్ రేట్ల జీవోల‌ను జారీ చేయ‌నున్నారు.

సంక్రాంతి టైమ్‌లో...

సంక్రాంతి స‌మ‌యంలో సినిమా టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. చివ‌రి నిమిషంలో ఇచ్చే జీవోల వ‌ల్ల సామాన్య ప్రేక్ష‌కుల‌పై భారం ప‌డుతుంద‌ని హైకోర్టు పేర్కొన్న‌ది. సినిమా రిలీజ్‌కు 90 రోజుల ముందే టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి నిర్మాత‌లు ప్ర‌భుత్వాన్ని అప్రోచ్ కావాల‌ని తీర్పు ఇచ్చింది. మన శంకర వరప్రసాద్ గారు తో పాటు ప‌లు సినిమా టికెట్ రేట్ల పెంపు విష‌యంలో నిబంధనలు ఉల్లంఘించారని కోర్టు ప్ర‌భుత్వ వ‌ర్గాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

 

Advertisement
Advertisement