త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US pauses visa appointments | ట్రంప్ మ‌రో షాక్‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత‌

US pauses visa appointments | ట్రంప్ యంత్రాంగం మ‌రో షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా వీసా ఆపాయింట్‌మెంట్ల‌ను అర్ధంత‌రంగా నిలిపివేసింది (US pauses visa appointments). ఇప్పటికే ఖరారైన ఇంటర్వ్యూలను కూడా ర‌ద్దు చేసింది.

D

International | Published On Aug 26, 2026, 11.34 am IST

US pauses visa appointments | ట్రంప్ మ‌రో షాక్‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత‌
Advertisement

US pauses visa appointments | త్రినేత్ర‌.న్యూస్ : అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేప‌ట్టిన త‌ర్వాత వీసా నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేసిన విష‌యం తెలిసిందే. ట్రంప్ అమ‌లు చేస్తున్న క‌ఠిన వీసా విధానాల వ‌ల్ల అన్ని దేశాల‌పై తీవ్ర‌ ప్రభావం ప‌డుతోంది. తాజాగా ట్రంప్ యంత్రాంగం మ‌రో షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా వీసా ఆపాయింట్‌మెంట్ల‌ను అర్ధంత‌రంగా నిలిపివేసింది (US pauses visa appointments). ఇప్పటికే ఖరారైన ఇంటర్వ్యూలను కూడా ర‌ద్దు చేసింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా రాయ‌బార కార్యాల‌యాలు, కాన్సులేట్‌ల‌లో పనిచేస్తున్న కాన్సులర్‌ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన‌ట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్ర‌తినిధి తెలిపారు. ఈ శిక్ష‌ణ నేప‌థ్యంలోనే వీసా అపాయింట్‌మెంట్ల‌ను నిలిపివేసిన‌ట్లు చెప్పారు. మ‌రోవైపు వీసా ఇంటర్వ్యూ తేదీలు ఖరారైన పలువురు దరఖాస్తుదారులకు అపాయింట్‌మెంట్లు మారినట్లు ఈ-మెయిల్స్‌ వెళ్లినట్లు స‌మాచారం. కొత్త తేదీని త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు కాన్సుల‌ర్ అధికారులు నిర్వ‌హించిన శిక్ష‌ణ కార్య‌క్ర‌మం దేని గురించి..? ఇది ఎంత‌కాలం కొన‌సాగుతుంది..? వంటి వివ‌రాలు తెలియ‌రాలేదు. అమెరికా ప్రభుత్వ ప్రయోజనాలపై ఆధారపడే అవకాశం ఉన్నట్లు భావించే దరఖాస్తుదారులను కాన్సుల‌ర్ అధికారులు వ‌డ‌పోసి, తొల‌గించేలా శిక్ష‌ణ కార్య‌క్ర‌మం ఉండ‌నున్న‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా వెల్ల‌డించింది. వీసా ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌గ్రంగా, స్థిరంగా మూల్యాంక‌నం చేసేలా చూడ‌ట‌మే ఈ కార్య‌క్ర‌మం ముఖ్య ఉద్దేశంగా పేర్కొంది.

15 శాతం క్షీణ‌త‌

ఇదిలా ఉండ‌గా.. ట్రంప్ యంత్రాంగం వ‌ల‌స విధానాల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్న నేప‌థ్యంలో అమెరికా కళాశాలల్లో ప్రవేశం కోరే భారతీయ విద్యార్థుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింది. గత ఏడాదితో పోలిస్తే 2025-26లో 15 శాతం క్షీణించిన‌ట్లు ఓ నివేదిక వెల్ల‌డించింది. 1,100కు పైగా విద్యాసంస్థలకు ప్రాతినిధ్యం వహించే 'కామన్ యాప్' ఈ నివేదికను విడుదల చేసింది. రాబోయే 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాల కోసం దరఖాస్తుల సంఖ్య మొత్తంగా పెరిగినప్పటికీ, మార్చి 1 నాటికి అంతర్జాతీయ దరఖాస్తుదారుల సంఖ్య 10 శాతం తగ్గింది. ఇది రికార్డు స్థాయిలో నమోదైన అత్యధిక తగ్గుదల అని పేర్కొంది.

Also Read..

ఆసుప‌త్రిలో భారీ అగ్నిప్ర‌మాదం.. 15 మంది న‌వ‌జాత శిశువులు స‌జీవ‌ద‌హ‌నం

భార‌త్ ధ‌ర్మ‌శాల కాదు.. ఇక్క‌డ నివ‌సించే హ‌క్కు దేశ ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే ఉంది : అమిత్ షా

న‌టికి మ‌ద్ద‌తుగా నిలిచిన‌ రాహుల్ గాంధీ.. బ్రో వెయిట్ అంటూ కంగ‌న కౌంట‌ర్‌

Advertisement
Advertisement