Bihar protests | ప్రధాని మోదీ రాజీనామా చేయాలనే పోస్టర్ పట్టుకున్నాడని.. పాట్నాలో ఆరేండ్ల బాలుడి అరెస్ట్..! వీడియో
Bihar protests | బీహార్ రాజధాని పాట్నాలో ఉద్యోగార్థులు నిర్వహించిన ర్యాలీ (Bihar protests) తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) వచ్చే నెలలో నిర్వహించనున్న ఉపాధ్యాయ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులు సీఎం సామ్రాట్ చౌదరి ఇంటి ముట్టడికి బయల్దేరారు.
Bihar protests | త్రినేత్ర.న్యూస్: బీహార్ రాజధాని పాట్నాలో ఉద్యోగార్థులు నిర్వహించిన ర్యాలీ (Bihar protests) తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) వచ్చే నెలలో నిర్వహించనున్న ఉపాధ్యాయ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులు సీఎం సామ్రాట్ చౌదరి ఇంటి ముట్టడికి బయల్దేరారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు లాఠీచార్జి చేయడంతోపాటు వాటర్ క్యానన్లు, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అయితే ఈ ఆందోళన సందర్భంగా పోలీసులు ఓ ఆరేండ్ల బాలుడిని (SIX year old child) అరెస్టు చేయడం వివాదాస్పదమైంది. నిరసనకారులకు మద్దతుగా ప్రధాని మోదీ (PM Modi) రాజీనామా చేయాలని ఉన్న పోస్టర్‌ను పట్టుకున్న ఆ బాలుడిని.. పోలీసులు చుట్టుముట్టారు. ఓ మహిళా పోలీస్ అధికారి ఆ బాలుడి గల్లా పట్టుకుని తీసుకెళ్తుండగా మీడియా ప్రతినిథులు వారిని చుట్టుముట్టారు. చిన్నారిని ఎందుకు తీసుకెళ్తున్నారంటూ ప్రశ్నించారు. దీంతో ఆమె ఆవేశంగా బాలుడితోపాటు అటూఇటూ తిరగుతూ వీడియోలో కనబడింది. జనం గుమికూడటంతో పెద్ద సంఖ్యలో పోలీసులు వారిచుట్టూ చేరారు. దీనిని తమ ఫోన్లలో బంధించిన పలువురు.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ప్రస్తుతం అది వైరల్ అవుతున్నది.

ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక్కోవిధంగా స్పందిస్తున్నారు. మనం నైతికంగా పతనమైన దేశంలో ఉన్నామంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. `విశ్వగురువు అని చెప్పుకునే గొప్పలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. తన రాజ్యాంగ హక్కులను వినియోగించుకుంటున్న ఒక ఆరేండ్ల చిన్నారిని కూడా మనం భరించలేకపోతున్నాం. నిన్న (మంగళవారం) బీహార్‌లో జరిగిన నిరసనల సందర్భంగా పోలీసులు ఒక ఆరేండ్ల పసివాడిని అరెస్ట్ చేశారు!. చేతిలో పోస్టర్ పట్టుకుని ప్రధానమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసినందుకు ఒక చిన్నారిని అరెస్ట్ చేశారు` అని మండిపడ్డారు.
We are a morally dead nation!
All the bravado about being Vishwaguru but cannot handle a six year old child executing his constitutional rights.
During Bihar protests yesterday, the police arrested a SIX year old child!
A child!!
A child!!
Just for holding a poster,…— Revathi (@revathitweets) August 26, 2026
కాగా, బాలుడిని పోలీసులు అరెస్టు చేయలేదని, ఉద్రిక్తల దృష్ట్యా శాంతిభద్రతల పరిస్థితి అదుపుతప్పడంతో అతడిని పక్కకు తీసుకెళ్లారని మరికొందరు పేర్కొంటున్నారు. దీనిని అరెస్ట్‌గా పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

Prashant Kishor | ముందు పదో తరగతి పాసవ్వండి.. బీహార్ సీఎం, విపక్షనేతకు ప్రశాంత్ కిషోర్ సవాల్
ఆగస్టు 26, 2026

CM Revanth Reddy | తెలంగాణ రైజింగ్ 2047 అడ్డుకోవడం రాజకీయ వివక్షే : సీఎం రేవంత్‌రెడ్డి
ఆగస్టు 24, 2026

Jairam Ramesh | ఇస్రోను కేంద్రం బలహీనపరుస్తోంది.. జైరామ్ రమేష్
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోష్.. లాభాల స్వీకరణకు దిగిన పెట్టుబడిదారులు..
- ●Hospital Fire | ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 15 మంది నవజాత శిశువులు సజీవదహనం
- ●Stock Markets | క్రూడ్ ధరలు, గ్లోబల్ సంకేతాలతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు
- ●Amit Shah | భారత్ ధర్మశాల కాదు.. ఇక్కడ నివసించే హక్కు దేశ ప్రజలకు మాత్రమే ఉంది : అమిత్ షా
- ●Asaduddin Owaisi | ఇస్లాంలో ఏది అవసరమో.. ఏది కాదో నిర్ణయించడానికి మీరెవరు?: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
- ●Rahul Gandhi | నటికి మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ.. బ్రో వెయిట్ అంటూ కంగన కౌంటర్

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోష్.. లాభాల స్వీకరణకు దిగిన పెట్టుబడిదారులు..

Hospital Fire | ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 15 మంది నవజాత శిశువులు సజీవదహనం

Stock Markets | క్రూడ్ ధరలు, గ్లోబల్ సంకేతాలతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Amit Shah | భారత్ ధర్మశాల కాదు.. ఇక్కడ నివసించే హక్కు దేశ ప్రజలకు మాత్రమే ఉంది : అమిత్ షా



