త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో జోష్‌.. లాభాల స్వీక‌ర‌ణ‌కు దిగిన పెట్టుబ‌డిదారులు..

Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి చ‌ర్చ‌ల దిశ‌గా మ‌ళ్లీ ప‌రిస్థితులు ఏర్ప‌డుతుండ‌డం, హోర్ముజ్ జ‌ల‌సంధి ద్వారా చ‌మురు స‌ర‌ఫ‌రాకు ఆటంకం తొల‌గ‌వ‌చ్చ‌న్న ఆశావాదం నేప‌థ్యంలో ఈక్విటీ మార్కెట్లు మ‌ళ్లీ లాభాల బాట ప‌ట్టాయి. దీంతో బులియ‌న్ మార్కెట్ల‌లోనూ జోరు పెరిగింది.

S

Business | Published On Aug 26, 2026, 11.16 am IST

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో జోష్‌.. లాభాల స్వీక‌ర‌ణ‌కు దిగిన పెట్టుబ‌డిదారులు..
Advertisement

Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి చ‌ర్చ‌ల దిశ‌గా మ‌ళ్లీ ప‌రిస్థితులు ఏర్ప‌డుతుండ‌డం, హోర్ముజ్ జ‌ల‌సంధి ద్వారా చ‌మురు స‌ర‌ఫ‌రాకు ఆటంకం తొల‌గ‌వ‌చ్చ‌న్న ఆశావాదం నేప‌థ్యంలో ఈక్విటీ మార్కెట్లు మ‌ళ్లీ లాభాల బాట ప‌ట్టాయి. దీంతో బులియ‌న్ మార్కెట్ల‌లోనూ జోరు పెరిగింది. బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయి. అయితే బుధ‌వారం మార్కెట్ల‌లో మాత్రం పెట్టుబ‌డిదారులు లాభాల స్వీక‌ర‌ణ‌కు దిగ‌డంతో ఆయా లోహాల ధ‌ర‌లు కాస్త త‌గ్గాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.31 శాతం త‌గ్గి 4,644 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.82 శాతం పెరిగి 69 డాల‌ర్ల‌కు చేరింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 196 పాయింట్లు పెరిగి 1,63,078 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1,772 పాయింట్లు పెరిగి 2,45,910 వ‌ద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.16,375 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,31, 000 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,63,750 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.16,37,500 గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే దీని ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,010 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,20,080గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,50,100 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,01,000గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే దీని ధ‌ర‌లోనూ ఎలాంటి మార్పు లేదు.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.12,281 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.98,248గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,22,810 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.12,28,100గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే దీని ధ‌ర‌లోనూ ఎలాంటి మార్పు లేదు.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,60,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,600గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,65,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,650 గా ఉంది.

Advertisement
Advertisement