త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US Consulate | ఖ‌మేనీ మృతి ప‌ట్ల పాక్‌లో నిర‌స‌న‌.. అమెరికా కాన్సులేట్ కార్యాల‌యంపై దాడి..

US Consulate | ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ మృతి ప‌ట్ల పాకిస్థాన్‌లో నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కొంద‌రు పాకిస్థాన్ పౌరులు క‌రాచీలో ఉన్న అమెరికా కాన్సులేట్ జ‌న‌ర‌ల్ కార్యాల‌యంపై భారీ ఎత్తున దాడుల‌కు పాల్ప‌డ్డారు. పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ షియా, ఇత‌ర ముస్లిం సంఘాలు ఈ దాడుల‌కు తెగబ‌డ్డాయి.

S

International | Published On Mar 1, 2026, 1.27 pm IST

US Consulate | ఖ‌మేనీ మృతి ప‌ట్ల పాక్‌లో నిర‌స‌న‌.. అమెరికా కాన్సులేట్ కార్యాల‌యంపై దాడి..
Advertisement

US Consulate | ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ మృతి ప‌ట్ల పాకిస్థాన్‌లో నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కొంద‌రు పాకిస్థాన్ పౌరులు క‌రాచీలో ఉన్న అమెరికా కాన్సులేట్ జ‌న‌ర‌ల్ కార్యాల‌యంపై భారీ ఎత్తున దాడుల‌కు పాల్ప‌డ్డారు. పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ షియా, ఇత‌ర ముస్లిం సంఘాలు ఈ దాడుల‌కు తెగబ‌డ్డాయి. ఆగ్ర‌హంతో నిర‌స‌నకారులు అమెరికా కాన్సులేట్ జ‌న‌ర‌ల్ కార్యాల‌యానికి చేరుకుని రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడుల‌కు పాల్ప‌డ్డారు. కార్యాల‌య అద్దాల‌ను ధ్వంసం చేశారు. ప‌రిస్థితిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు టియ‌ర్ గ్యాస్‌, వార్నింగ్ షాట్స్‌ను ప్ర‌యోగించారు. ఈ దాడుల్లో కొంద‌రికి గాయాలు అయ్యాయ‌ని రెస్‌క్యూ అధికారులు వెల్ల‌డించారు. అయితే పోలీస్ ఫైరింగ్‌లో ప‌లువురు మృతి చెందిన‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి.

పాక్ పౌరుల్లో ఆగ్ర‌హం..

ఖ‌మేనీ మృతికి నిర‌స‌న‌గానే ఈ దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇరాన్‌పై జ‌రిగిన దాడుల‌కు షియా ముస్లింలు అమెరికాను బాధ్యుల‌ను చేస్తుండగా పాకిస్థాన్‌లోని పౌరులు సైతం ఖ‌మేనీ మృతిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. క‌రాచీలోని ఎంటీ ఖాన్ రోడ్డు, నుమాయిష్ ప్రాంతాల్లో భారీ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. రోడ్ల‌ను మూసేశారు. ప్ర‌జ‌లంతా ఆ ప్రాంతం నుంచి దూరంగా ఉండాల‌ని అధికారులు ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. మ‌రోవైపు క‌రాచీలోని అమెరిక‌న్ కాన్సులేట్ కార్యాల‌యం భ‌ద్ర‌త అల‌ర్ట్‌ను జారీ చేసింది. అయితే పాకిస్థాన్ ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ ఈ ఘ‌ట‌న పాకిస్థాన్‌కు అమెరికాతో ఉన్న సంబంధాల‌ను దెబ్బ తీసే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement