ICC | మహిళల టీ20 ప్రపంచకప్ 2026.. ప్రైజ్ మనీ భారీగా పెంపు..
ICC | ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) త్వరలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి ప్రైజ్ మనీని గణనీయంగా పెంచినట్లు తెలిపింది. ఇంగ్లండ్, వేల్స్లో మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న ఈ టోర్నీకి మొత్తం రూ.82 కోట్ల ప్రైజ్ పూల్‌ను ప్రకటించారు. గత ఎడిషన్‌తో పోలిస్తే ప్రైజ్ మనీని దాదాపు 10 శాతం పెంచినట్లు తెలియజేసింది.
ICC | ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) త్వరలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి ప్రైజ్ మనీని గణనీయంగా పెంచినట్లు తెలిపింది. ఇంగ్లండ్, వేల్స్లో మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న ఈ టోర్నీకి మొత్తం రూ.82 కోట్ల ప్రైజ్ పూల్‌ను ప్రకటించారు. గత ఎడిషన్‌తో పోలిస్తే ప్రైజ్ మనీని దాదాపు 10 శాతం పెంచినట్లు తెలియజేసింది. కాగా ఈ సారి మహిళల టీ20 ప్రపంచకప్‌లో 12 జట్లు పాల్గొంటున్నాయి. 2024 ఎడిషన్‌లో 10 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. ఈ ఏడాది జూన్ 12 నుంచి జూలై 5 వరకు టోర్నీ జరగనుంది. మొత్తం 7 వేదికల్లో పోటీలను నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్‌ను ప్రపంచ ప్రసిద్ధ లార్డ్స్ మైదానంలో నిర్వహించనున్నారు.
రూ.82 కోట్ల ప్రైజ్ పూల్..
గత ఎడిషన్ టోర్నీని యూఏఈలో నిర్వహించగా ఆ టోర్నమెంట్‌కు ఐసీసీ మొత్తం ప్రైజ్ మనీ రూ.74 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు దీన్ని రూ.82 కోట్లకు పెంచింది. 2024తో పోలిస్తే ఈ ప్రైజ్ మనీ దాదాపుగా 10 శాతం మేర పెరిగింది. ఇక ప్రస్తుత టోర్నీలో విజేత జట్టుకు రూ.21.80 కోట్లను ఇవ్వనున్నారు. రన్నరప్ జట్టుకు రూ.10 కోట్లు లభిస్తాయి. సెమీ ఫైనల్స్ ఆడే జట్లకు ఒక్కో టీమ్‌కు రూ.6.29 కోట్లను ఇస్తారు. లీగ్ దశలో నిష్క్రమించే జట్లకు రూ.29 లక్షల ప్రోత్సాహక ప్రైజ్ మనీని ఒక్కో టీమ్‌కు అందజేస్తారు. అయితే టోర్నీలో పాల్గొనే 12 జట్లకు ఒక్కో దానికి సుమారుగా రూ.2.06 కోట్ల మేర బహుమతి ఇస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.
12 జట్లు, 33 మ్యాచ్‌లు, 24 రోజులు..
వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు, శ్రీలంక తలపడనున్నాయి. బర్మింగ్ హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూన్ 12న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భారత్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 33 మ్యాచ్ లను 24 రోజుల్లో నిర్వహిస్తారు. కాగా వుమెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 ట్రోఫీని ఆతిథ్య నగరాల్లో ప్రదర్శించనున్నారు. మే 7 నుంచి 10 వరకు స్కాట్లండ్‌లో ఈ ప్రదర్శన ప్రారంభమై చివరకు లండన్‌లో ముగుస్తుంది. ఈ సందర్భంగా ఐసీసీ సీఈవో సంజోగ్ గుప్తా మాట్లాడుతూ మహిళల క్రికెట్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. టోర్నీని ఈసారి 12 జట్లకు విస్తరించామని, ప్రైజ్ మనీని పెంచామని దీని వల్ల మహిళా క్రికెట్లో అంతర్జాతీయ స్థాయిలో పోటీ మరింత పెరుగుతుందని అన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






