Sydney | ఆస్ట్రేలియాలో దారుణం.. సిడ్నీ బాండీ బీచ్‌లో దుండగుల కాల్పులు.. 10 మంది మృతి..
International | Published On Dec 14, 2025, 5.33 pm IST
Sydney | ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం అక్కడి బాండీ బీచ్‌లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. సెమి ఆటోమేటిక్ రైఫిల్స్‌తో బీచ్‌లోని ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో 10 మంది తీవ్ర గాయాల పాలై మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న హాస్పిటల్స్ కు తరలించారు. స్థానిక అధికారులు చెబుతున్న ప్రకారం ఆ బీచ్ ఎంతో పాపులర్ అని, ఈ క్రమంలోనే దుండగులు ఆ బీచ్‌లోని ప్రజలను టార్గెట్ చేసి ఉంటారని భావిస్తున్నారు. స్థానికులు ఆ బీచ్, దాని పరిసరాలకు వెళ్లకుండా దూరంగా సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు.
కాగా ఆయుధాలను కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు బీచ్‌కు సమీపంలో ఉన్న బ్రిడ్జి నుంచి కాల్పులు జరుపుతున్న దృశ్యాలు, ప్రజల హాహాకారాలు అక్కడే ఉన్న కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ క్రమంలోనే ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తెలిపిన ప్రకారం దుండగులు ఇద్దరిలో ఒకరిని పోలీసులు కాల్చివేయగా, మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సంఘటనకు సంబంధించి స్థానికంగా ఉన్న న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. బీచ్‌లో పోలీస్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 11 మంది గాయాలకు గురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని, వారిలో ఇద్దరు పోలీసులు ఉన్నారని తెలియజేశారు. కాగా సిడ్నీలోని బాండీ బీచ్ స్థానికంగా ఉన్న ఫేమస్ బీచ్‌లలో ఒకటి కావడం గమనార్హం. అయితే ఈ సంఘటన కేవలం దుండగుల పనేనా లేక ఉగ్రవాదుల ప్రేమయం ఉందా అన్న విషయంపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

ICC Test Rankings | ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. మూడో స్థానానికి భారత్
మే 1, 2026

David Warner | చిక్కుల్లో డేవిడ్ వార్నర్.. డ్రంక్ డ్రైవ్ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు..!
ఏప్రిల్ 7, 2026

SRH | సన్‌రైజర్స్‌కు షాక్.. ఆస్ట్రేలియాకు కెప్టెన్ పాట్ కమిన్స్..! మళ్లీ తిరిగి వచ్చేనా..?
ఏప్రిల్ 4, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



