TG Bhavan | ఆస్ట్రేలియాలో ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం
TG Bhavan | ఆస్ట్రేలియాలో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసుల కోసం ప్రత్యేకంగా ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలంగాణ కల్చరల్ సెంటర్ వ్యవస్థాపకుడు అనిల్ బైరెడ్డి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లోనూ సజీవంగా ఉంచడంతో పాటు, ప్రవాస తెలంగాణీయులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
TG Bhavan | ఆస్ట్రేలియాలో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసుల కోసం ప్రత్యేకంగా ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలంగాణ కల్చరల్ సెంటర్ వ్యవస్థాపకుడు అనిల్ బైరెడ్డి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లోనూ సజీవంగా ఉంచడంతో పాటు, ప్రవాస తెలంగాణీయులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనిల్ బైరెడ్డి మాట్లాడుతూ.. గత 14 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలోని తెలంగాణ కమ్యూనిటీ అభ్యున్నతి, ఐక్యత కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించే బతుకమ్మ సంబరాలతో పాటు పలు సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల ద్వారా తెలంగాణ సమాజాన్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నామని చెప్పారు. తెలంగాణ భవన్ నిర్మాణం ద్వారా విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకు తమ సంస్కృతి, సంప్రదాయాలను ఆచరించేందుకు, భావితరాలకు వాటిని పరిచయం చేసేందుకు ఒక ప్రత్యేక వేదిక అందుబాటులోకి రానుందని తెలిపారు. రాబోయే రోజుల్లో నిర్మించనున్న ఈ భవన్ ప్రవాస తెలంగాణ బిడ్డలందరికీ ఉమ్మడి కేంద్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ మూలాలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఈ భవన్ ఎంతగానో దోహదపడుతుందని అనిల్ బైరెడ్డి పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Deeksha Diwas | దక్షిణాఫ్రికాలో 14 రోజుల పాటు ‘దీక్షా దివస్’ ప్రత్యేక కార్యక్రమాలు
నవంబర్ 16, 2026

Chirumarthi Lingaiah | సాగర్ ఎక్కడ.. కుప్పం ఎక్కడ? 72 టీఎంసీల నీళ్లు పోతుంటే ఏం చేస్తున్నారు?
నవంబర్ 6, 2026

Serilingampally Gurukulam Land Row | శేరిలింగంపల్లిలో రూ.1000 కోట్ల గురుకుల భూమి కబ్జా.. చేసిందెవరు?
నవంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Kayadu Lohar | 12 వేల అడుగుల ఎత్తైన పర్వతంపై టాలీవుడ్ హీరోయిన్ సాహసం
- ●Kondagattu Anjanna | నిజరూపంలో దర్శనమిచ్చిన కొండగట్టు అంజన్న
- ●Rekha Naik | రైస్ మిల్ నా పేరు మీదే ఉంది.. అందుకే ఈడీ వచ్చింది
- ●Jabardasth Comedian | యాంకర్‌ను పెళ్లిచేసుకున్న జబర్ధస్థ్ కమెడియన్ - ఏడేళ్ల ప్రేమ అంటూ పోస్ట్
- ●Sridhar Babu | హైదరాబాద్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- ●Sreeleela | శ్రీలీలను వదలని బ్యాడ్‌లక్ - సాయిపల్లవి ముందు యాక్టింగ్‌లో తేలిపోయిందంటూ ట్రోల్స్

Kayadu Lohar | 12 వేల అడుగుల ఎత్తైన పర్వతంపై టాలీవుడ్ హీరోయిన్ సాహసం

Kondagattu Anjanna | నిజరూపంలో దర్శనమిచ్చిన కొండగట్టు అంజన్న

Rekha Naik | రైస్ మిల్ నా పేరు మీదే ఉంది.. అందుకే ఈడీ వచ్చింది

Jabardasth Comedian | యాంకర్‌ను పెళ్లిచేసుకున్న జబర్ధస్థ్ కమెడియన్ - ఏడేళ్ల ప్రేమ అంటూ పోస్ట్



