Earthquake | వరుస భూకంపాలతో వణికిపోయిన వెనెజువెలా.. జపాన్‌లో ప్రకంపణలు..
Earthquake | వరుస భూకంపాలతో (Earthquake) వెనెజువెలా (Venezuela) వణికిపోయింది. బుధవారం సాయంత్రం నిమిషాల వ్యవధిలో రెండు అత్యంత శక్తివంతమైన భూకంపాలు వచ్చాయి. రిక్టర్‌స్టేలుపై వీటి వీవ్రత 7.1, 7.5గా నమోదయింది.
International | Published On Jun 25, 2026, 7.04 am IST
Earthquake | త్రినేత్ర.న్యూస్: వరుస భూకంపాలతో (Earthquake) వెనెజువెలా (Venezuela) వణికిపోయింది. బుధవారం సాయంత్రం నిమిషాల వ్యవధిలో రెండు అత్యంత శక్తివంతమైన భూకంపాలు వచ్చాయి. రిక్టర్‌స్టేలుపై వీటి వీవ్రత 7.1, 7.5గా నమోదయింది. దీంతో రాజధాని కారకాస్‌తోపాటు (Caracas) దేశంలోని పలు నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూ ప్రకంపనల ధాటికి కారకాస్‌లో పలు భవనాలు కుప్పకూలాయి. భయంతో జనాలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగుతు తీశారు. అనేక చోట్ల భవనాలు, నివాస సముదాయాలు కుప్పకూలాయి. భూకంపం వల్ల సంభవించిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు.

అమెరికా భూగర్భ పరిశోధనా సంస్థ (USGS) నివేదిక ప్రకారం.. బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) మొదటి భూకంపం 7.1 తీవ్రత సంభవించింది. కారకాస్‌కు 168 కిలోమీటర్ల (104 మైళ్లు) దూరంలో ఉన్న తీరప్రాంతం మొరోన్ (Morón)కు పశ్చిమ భాగంలో భూకంప కేంద్రం ఉంది. భూమిలో 13 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయి. ఈ ప్రకంపనలు వచ్చిన కేవలం ఒక్క నిమిషం వ్యవధిలోనే 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. దీని కేంద్రం మొరోన్ నగరానికి నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.

సునామీ హెచ్చరికలు..
ఈ నేపథ్యంలో యూఎస్ పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం వర్జిన్ ఐస్‌ల్యాండ్‌లో సునామీ అలర్ట్ జారీచేసింది. డొమినికన్ రిపబ్లిక్ కూడా సునామీ హెచ్చరికలు జారీచేసింది. పోర్టారికో హెచ్చరికలు జారీచేసినప్పటికీ కొద్దిసేపటికే ఉపసంహరించుకుంది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంప ప్రభావం కనిపించిందని వెనెజువెలా అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో వెల్లడించారు. ముఖ్యంగా కారకాస్‌లోని అల్టామిరా ప్రాంతంలో ఇండ్లు, భవనాలు నేలకూలాయని చెప్పారు. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారిందని తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేశామన్నారు.

జపాన్‌లోనూ..
జపాన్‌లోనూ భారీ భూకంపం వచ్చింది. తోహోకు తీరంలో రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూమి కంపించింది. ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలో భూకంప కేంద్ర ఉన్నట్లు గుర్తించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా తోహోకు షింకన్‌సేన్ బుల్లెట్ రైలు సర్వీసులతో పాటు పలు రైళ్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
తాజావార్తలు
- ●Tungabhadra Dam Gates | నేడు తుంగభద్ర డ్యామ్ నూతన గేట్లు ప్రారంభం.. హాజరుకానున్న మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
- ●Horoscope | జూన్ 25 రాశి ఫలాలు.. మీపై గురుడి ప్రభావంతో ఖర్చులు పెరగవచ్చు!
- ●Veerangana Rani Durgavati Mandavi | మొఘలుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వీరనారి: ఎవరీ 'రాణీ దుర్గావతి'? ఏమా కథ?
- ●Tungabhadra Water Share | తుంగభద్ర జలాల్లో మన వాటా ఏదీ? ఆర్డీఎస్ పనులపై కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
- ●Sanjay Jaju IAS | తెలంగాణ నూతన సీఎస్.. రేవంత్ సర్కార్ గురి 'మీసేవ' సృష్టికర్తపైనే
- ●Mumbai Local Train Murder | నిందితుడిని ఉరి తీయాల్సిందే.. అసలు ఫస్ట్ క్లాస్ బోగీలోకి కత్తి ఎలా వచ్చింది?

Tungabhadra Dam Gates | నేడు తుంగభద్ర డ్యామ్ నూతన గేట్లు ప్రారంభం.. హాజరుకానున్న మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

Horoscope | జూన్ 25 రాశి ఫలాలు.. మీపై గురుడి ప్రభావంతో ఖర్చులు పెరగవచ్చు!

Veerangana Rani Durgavati Mandavi | మొఘలుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వీరనారి: ఎవరీ 'రాణీ దుర్గావతి'? ఏమా కథ?

Tungabhadra Water Share | తుంగభద్ర జలాల్లో మన వాటా ఏదీ? ఆర్డీఎస్ పనులపై కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి






