త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trump vs Canada | ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఆహ్వానం రద్దు.. కెనడా, యూఎస్ మధ్య ముదురుతున్న దౌత్య వివాదం

అమెరికా అండతోనే కెనడా మనుగడ సాగిస్తోందన్న ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మార్క్ కార్నీ ధీటుగా స్పందించారు. దీనికి ప్రతిచర్యగా కెనడాకు ఇచ్చిన 'బోర్డ్ ఆఫ్ పీస్' (శాంతి మండలి) ఆహ్వానాన్ని ట్రంప్ రద్దు చేశారు.

J

International | Published On Jan 23, 2026, 2.10 pm IST

Trump vs Canada | ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఆహ్వానం రద్దు.. కెనడా, యూఎస్ మధ్య ముదురుతున్న దౌత్య వివాదం

సంక్షిప్త సారాంశం

దావోస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య మొదలైన వాగ్వాదం ముదురుతోంది. కెనడా తనపై ఆధారపడి ఉందని ట్రంప్ అనగా, తాము స్వయంశక్తితో ఎదిగామని కార్నీ బదులిచ్చారు. దీంతో ఆగ్రహించిన ట్రంప్, తన శాంతి మండలి నుంచి కెనడాను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Trump vs Canada | త్రినేత్ర.న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా కెనడాకు తన ప్రతిష్టాత్మక 'బోర్డ్ ఆఫ్ పీస్' (Board of Peace)  - శాంతి మండలిలో సభ్యత్వం కల్పిస్తూ ఇచ్చిన ఆహ్వానాన్ని ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (Davos 2026) వేదికగా ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చిచ్చుకు దారితీసింది.

వివాదానికి కారణం ఏంటి?

ఇటీవల దావోస్‌లో జరిగిన సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. "అమెరికా అండ ఉండబట్టే కెనడా బతికి ఉంది" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా స్పందించారు. గురువారం క్యూబెక్ సిటీలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, "కెనడా అమెరికా వల్ల బతకడం లేదు.. కెనడియన్ల కృషి వల్ల కెనడా వర్ధిల్లుతోంది" అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ఉన్నప్పటికీ, తమ సార్వభౌమత్వాన్ని తక్కువ చేయవద్దని కార్నీ హితవు పలికారు.

ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ కౌంటర్

కార్నీ వ్యాఖ్యలతో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, తన 'ట్రూత్ సోషల్' ప్లాట్‌ఫామ్‌లో కెనడాకు ఇచ్చిన ఆహ్వానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. "డియర్ ప్రైమ్ మినిస్టర్ కార్నీ.. బోర్డ్ ఆఫ్ పీస్‌లో కెనడా చేరడానికి సంబంధించి పంపిన ఆహ్వానాన్ని మేము ఉపసంహరించుకుంటున్నాము" అని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, వివాదాల పరిష్కారం కోసం బిలియన్ డాలర్ల బడ్జెట్‌తో ట్రంప్ ఈ బోర్డును ఏర్పాటు చేశారు.

కెనడాను యూఎస్ మ్యాప్‌లో చేర్చిన ట్రంప్

ఈ వివాదం ఇంతటితో ఆగలేదు. కొద్దిరోజుల క్రితం ట్రంప్ సోషల్ మీడియాలో ఒక మ్యాప్‌ను పోస్ట్ చేశారు. అందులో కెనడా, గ్రీన్‌లాండ్, వెనిజులా దేశాలపై అమెరికా జెండా కప్పి ఉంది. అంటే ఆ దేశాలను అమెరికాలో విలీనం చేసుకున్నట్లు, ఇక నుంచి ఆ దేశాలు అమెరికా భూభాగంలో ఉన్నట్లుగా అది సూచిస్తోంది. దీనిపై కెనడాలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

సార్వభౌమత్వమే ముఖ్యం: మార్క్ కార్నీ

ప్రపంచ దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్నాయని, ఇలాంటి సమయంలో కెనడా ఒక ఆదర్శంగా నిలవాలని కార్నీ పిలుపునిచ్చారు. అమెరికాతో వాణిజ్య సంబంధాలు ఉన్నప్పటికీ, రక్షణ రంగంలో తమ బలాన్ని పెంచుకుంటామని, సరిహద్దులను మరింత భద్రపరుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement