త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump New US Map | అమెరికా భూభాగాలుగా కెనడా, వెనిజులా, గ్రీన్‌లాండ్.. యూఎస్ కొత్త మ్యాప్ విడుదల చేసిన ట్రంప్

డొనాల్డ్ ట్రంప్ కెనడా, వెనిజులా, గ్రీన్లాండ్‌ను అమెరికా భూభాగాలుగా చూపిస్తూ షేర్ చేసిన మ్యాప్ అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అసలు ట్రంప్ గ్రీన్లాండ్‌ను ఎందుకు కోరుకుంటున్నాడు? దాని వెనుక ఉన్న వ్యూహాత్మక, ఆర్థిక కారణాలేంటి?

J

International | Published On Jan 20, 2026, 6.14 pm IST

Donald Trump New US Map | అమెరికా భూభాగాలుగా కెనడా, వెనిజులా, గ్రీన్‌లాండ్.. యూఎస్ కొత్త మ్యాప్ విడుదల చేసిన ట్రంప్
Advertisement

Donald Trump New US Map | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలపై అన్నిరకాలుగా దాడులు చేస్తున్నాడు. ఏ దేశాన్నీ వదలడం లేదు. ఓవైపు టారిఫ్‌లు, మరోవైపు ఆయా దేశాల్లో ఉన్న సహజ వనరులు దోచుకోవడం, దేశాధ్యక్షులను బెదిరించడం, ఇలా ట్రంప్ ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. తాజాగా మరో అడుగు ముందుకేసి కెనడా, వెనిజులా, గ్రీన్‌లాండ్ దేశాలను యూఎస్ టెరిటరీలో కలుపుతూ కొత్త మ్యాప్‌ను సోషల్ మీడియాలో వదిలాడు. కెనడా, వెనిజులా, గ్రీన్లాండ్‌ను అమెరికా భూభాగాలుగా చూపిస్తూ షేర్ చేసిన మ్యాప్ అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. తన సొంత సోషల్ మీడియా అయిన ట్రుత్‌లో కొత్త మ్యాప్‌ను పోస్ట్ చేశాడు. అలాగే.. గ్రీన్‌లాండ్ గడ్డ మీద అమెరికా పతాకాన్ని ఎగురవేస్తూ కనిపించాడు. పక్కనే గ్రీన్‌లాండ్ యూఎస్ టెరిటరీ, ఎస్టాబ్లిష్డ్ 2026 అని రాసి ఉన్న బోర్డ్ కూడా ఉంది. ఆయన పక్కన వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, మార్కొ రుబియో స్టేట్ సెక్రటరీ కూడా ఉండటం గమనార్హం.

51వ రాష్ట్రంగా కెనడాకు చాన్స్ ఇచ్చిన ట్రంప్

గత సంవత్సరం అధికారంలోకి రాగానే ముందు కెనడాపై విరుచుకుపడ్డాడు ట్రంప్. కెనడాకు యూఎస్ 51వ రాష్ట్రంగా అవకాశం ఇస్తామని కెనడా ప్రభుత్వానికి బంపర్ ఆఫర్ ప్రకటించినా.. కెనడా ప్రభుత్వం ట్రంప్ ఆఫర్‌ను తిరస్కరించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

trump posts new map adding Canada Venezuela and Greenland as us territories

వెనిజులాపై ట్రంప్ గుత్తాధిపత్యం

ఆ తర్వాత వెనిజులా దేశంపై విరుచుకుపడ్డ ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడిని బందీని చేసి యూఎస్‌కి తరలించి వెనిజులాను చేజిక్కించుకొని ఆ దేశ ఆయిలు నిల్వలపై యూఎస్‌దే అధికారం అంటూ ప్రకటించాడు. ప్రస్తుతం వెనిజులాకు తాత్కాలిక అధ్యక్షురాలు ఉన్నా.. వెనిజులా పాలన యూఎస్ నుంచే సాగుతుందని ట్రంప్ సంచలన ప్రకటన చేశాడు.

స్వయం ప్రతిపత్తి దేశం గ్రీన్‌లాండ్‌పై కన్ను

ఆర్కిటిక్ రీజియన్‌లో ఉన్న స్వయం ప్రతిపత్తి దేశం గ్రీన్‌లాండ్‌పై కూడా ట్రంప్ కన్ను పడింది. ఇక్కడ అమెరికాకు చెందిన తులే ఎయిర్ బేస్ కూడా ఉంది. రష్యా, చైనా ఆర్కిటిక్ ప్రాంతంలో తమ ప్రభావాన్ని పెంచుకుంటున్న తరుణంలో, అమెరికా తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ఈ ప్రాంతం చాలా కీలకంగా మారింది. అలాగే, గ్రీన్‌లాండ్‌లో బొగ్గు, రాగి, ఇనుము, జింక్ లాంటి సహజ సంపద అపారంగా ఉంది. అరుదైన మినరల్స్ ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకొని ప్రపంచదేశాలను గుప్పిట్లో పెట్టుకోవాలనేది ట్రంప్ ప్లాన్.

 

Advertisement

తాజావార్తలు

Advertisement