త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump Giorgia Meloni | ట్రంప్, మెలోని మధ్య ముదిరిన ‘ఫోటో’ వార్.. నా పాపులారిటీ గురించి నీకెందుకు అంటూ ఇటలీ పీఎం ఫైర్!

నాతో ఫోటో కోసం మెలోని బతిమిలాడారన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఇటలీ పీఎం తీవ్రంగా స్పందించారు. మీతో స్నేహం నాకేం లాభం చేయలేదంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

J

International | Published On Jun 20, 2026, 9.20 pm IST

Donald Trump Giorgia Meloni | ట్రంప్, మెలోని మధ్య ముదిరిన ‘ఫోటో’ వార్.. నా పాపులారిటీ గురించి నీకెందుకు అంటూ ఇటలీ పీఎం ఫైర్!
Advertisement
  • జీ7 సమ్మిట్‌లో తనతో ఫోటో దిగేందుకు ఇటలీ ప్రధాని మెలోని బతిమిలాడారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్
  • ఇటలీలో తన పాపులారిటీ పెంచుకోవడానికే మెలోని ఇలా చేశారని, ఇరాన్ వివాదంలో అమెరికాకు సహకరించలేదని ట్రంప్ విమర్శలు
  • ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని, తానెప్పుడూ ఎవరినీ బతిమిలాడనని మెలోని ఘాటు రిప్లై
  • నా పాపులారిటీ గురించి మీకెందుకు, ముందు మీ సంగతి చూసుకోండని ట్రంప్‌కు మెలోని స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump Giorgia Meloni | త్రినేత్ర.న్యూస్ : ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 (G7) సమ్మిట్ వేదికగా మొదలైన ఓ చిన్న ఫోటో వివాదం.. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది. తనతో ఒక ఫోటో దిగడం కోసం మెలోని పదేపదే బతిమిలాడారంటూ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఇటలీ పీఎం అదే రేంజ్‌లో ఘాటుగా స్పందించారు.

ట్రంప్ ఏమన్నారంటే..

ఇటీవల ఓ ఇటాలియన్ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన ట్రంప్ సోషల్ మీడియా వేదికగా మెలోనిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటలీలో మెలోని పాపులారిటీ (Popularity) దారుణంగా పడిపోయిందని, దాన్ని పెంచుకోవడానికే తనతో స్నేహం చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. "నాతో ఒక ఫోటో దిగాలని ఆమె ఎంతగానో బతిమిలాడారు. నాకు ఇష్టం లేకపోయినా ఆమె పరిస్థితి చూసి జాలిపడి ఫోటో దిగాను" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఇరాన్‌తో వివాదం సమయంలో అమెరికా మిలిటరీకి ఇటలీ రన్‌వేలను (Runways) వాడుకునేందుకు మెలోని అనుమతి ఇవ్వలేదని, నాటో (NATO) మిత్రదేశాలను రక్షించేందుకు అమెరికా కోట్లాది డాలర్లు ఖర్చు చేస్తున్నా ఆమె ఇలా చేయడం సరికాదని మండిపడ్డారు.

దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మెలోని

ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను మెలోని పూర్తిగా ఖండించారు. అవన్నీ కట్టుకథలని కొట్టిపారేశారు. ఇన్‌స్టాగ్రామ్ (Instagram), ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ.. "కారణం లేకుండా చేస్తున్న ఈ దాడులు అర్థరహితం. నా పాపులారిటీ గురించి మీకెందుకు? ముందు మీ పాపులారిటీ సంగతి మీరు చూసుకోండి. మీతో స్నేహం చేయడం వల్ల నా పాపులారిటీకి వచ్చిన లాభం ఏమీ లేదు. ఇటలీ ప్రయోజనాలను కాపాడటంపైనే నా పాపులారిటీ ఆధారపడి ఉంటుంది" అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

మేము ఎవరినీ బతిమిలాడము..

మిత్రదేశాల పట్ల అమెరికా అధ్యక్షుడు ఇలా ప్రవర్తించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని మెలోని అన్నారు. "పాశ్చాత్య దేశాల శత్రువుల పట్ల చూపించాల్సిన కఠినత్వాన్ని ట్రంప్ మిత్రదేశాలపై చూపిస్తున్నారు. శత్రువులతో మాత్రం రాజీ పడుతున్నారు. ఒక్క విషయం ఆయన గుర్తుంచుకోవాలి.. నేను కానీ, ఇటలీ దేశం కానీ ఎవరినీ బతిమిలాడాల్సిన (Beg) అవసరం లేదు" అని మెలోని తేల్చిచెప్పారు.

Advertisement
Advertisement