Donald Trump | ఇండియా-పాక్ యుద్ధం ఆపింది నేనే.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట
Donald Trump | భారత్-పాక్ విషయంలో (India-Pak Conflict) అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వైఖరిలో ఎలాంటి మార్పూ రావడం లేదు.
International | Published On Feb 6, 2026, 11.04 am IST
Donald Trump | భారత్-పాక్ విషయంలో (India-Pak Conflict) అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వైఖరిలో ఎలాంటి మార్పూ రావడం లేదు. గతేడాది ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తానే తగ్గించానంటూ మరోసారి చాటింపు వేసుకున్నారు. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది నేను అంటూ ఇప్పటికే వందసార్లు ప్రకటించుకున్న ట్రంప్.. మళ్లీ అదేపాట ఎత్తుకున్నారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది తానే అని మరోసారి ప్రకటించుకున్నారు. "ఏడాదిలో నేను ఎనిమిది యుద్ధాలను ఆపాను. అందులో కంబోడియా-థాయ్‌లాండ్, కొసావో-సెర్బియా, ఇండియా-పాక్, ఇజ్రాయెల్-ఇరాన్, అర్మేనియా-అజర్‌బైజాన్, ఈజిస్ట్-ఇథియోపియా ఉన్నాయి" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కాగా, గతేడాది మే నుంచి ట్రంప్ 100 సార్లకుపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేసిఉంటారు. పాక్-భారత్ మధ్య యుద్ధం తానే ఆపానంటూ ప్రపంచ వేదికగా చెప్పుకుంటున్నారు. అయితే, ఈ విషయంలో భారత్ మాత్రం మూడో వ్యక్తి మధ్యవర్తిత్వాన్ని మొదటి నుంచి ఖండిస్తూ వస్తోంది. స్వయంగా ప్రధానే ఈ విషయాన్ని చెప్పినప్పటికీ.. ట్రంప్ ప్రకటనలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒకచోట భారత్-పాక్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. రెండు దేశాల మధ్య యుద్ధం ఆపింది తానే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






