Liquid Gas Truck | లిక్విడ్ గ్యాస్‌తో వెళ్తున్న ట్రక్కు బోల్తా.. షాకింగ్ విజువల్స్
Liquid Gas Truck | చిలీ (Chile)లో ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని శాంటియాగో (Santiago)లో లిక్విడ్ గ్యాస్‌తో వెళ్తున్న ట్రక్కు (Liquid Gas Truck) బోల్తా పడింది.
International | Published On Feb 21, 2026, 3.12 pm IST
Liquid Gas Truck | చిలీ (Chile)లో ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని శాంటియాగో (Santiago)లో లిక్విడ్ గ్యాస్‌తో వెళ్తున్న ట్రక్కు (Liquid Gas Truck) బోల్తా పడింది. ఆ తర్వాత భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 17 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ట్రక్కు హైవేపై వెళ్తుండగా.. ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. ఆ తర్వాత పేలిపోయి గ్యాస్ మొత్తం బయటకు వచ్చేసింది. ఈ ఘటనతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాసేపటికే అక్కడ మంటలు వ్యాపించాయి. లిక్విడ్ గ్యాస్ పేలడం వల్ల సుమారు 150 నుంచి 200 మీటర్ల పరిధి వరకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కనీసం 50 వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాదం పట్ల దేశాధ్యక్షుడు గాబ్రియల్ బోరిస్ విచారం వ్యక్తం చేశారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు శాంటియాగో మెట్రోపాలిటన్ ప్రాంత గవర్నర్ క్లాడియో ఒరెగో తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
https://x.com/Schallabweiser2/status/2024866853672169793
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



