Road Accident | ఐషర్ వాహనాన్ని ఢీకొని.. బ్రిడ్జిపై నుంచి కింద పడిన ట్రావెల్స్ బస్సు..
Road Accident | హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం (Anantapur) జిల్లా పామిడి మండలం పొగరూరు సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సును (Travels Bus) ఎదురుగా వస్తున్న ఐషర్ వాహనం (Eicher Vehicle) ఢీకొట్టింది.
Andhra pradesh | Published On Aug 9, 2026, 9.30 am IST
Road Accident | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం (Anantapur) జిల్లా పామిడి మండలం పొగరూరు సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సును (Travels Bus) ఎదురుగా వస్తున్న ఐషర్ వాహనం (Eicher Vehicle) ఢీకొట్టింది. దీంతో నియంత్రణ కోల్పోయిన రెండు వాహనాలు బ్రిడ్జిపైనుంచి కింద పడ్డాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని తొలుత పామిడి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రాథమిక చికిత్స అంనతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి అనంతపురంలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

ప్రమాదంలో బస్సు, ఐషర్ వాహనం క్యాబిన్లు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో ఇద్దరు డ్రైవర్లు అందులోనే ఇరుకిపోయారు. వారిని వెలికితీయడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. వాహనాల భాగాలను కట్ చేసి ఇద్దరు డ్రైవర్లను సురక్షితంగా వెలుపలికి తీశారు. అయితే వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రమాదం కారణంగా జాతీయరహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాసేపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను క్లియర్ చేశారు. ఈఘటనపై కేసు నమోదు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- ●Mahesh Babu | మహేశ్ బాబు బర్త్డే స్పెషల్.. అదిరిపోయే లుక్లో రుద్ర..
- ●Weekly Horoscope | ఈవారం రాశి ఫలాలు.. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి!
- ●Traffic Restrictions | హైదరాబాద్లో బోనాలు.. ఈ రూట్లలో వెళ్లారో ఇక అంతే..!
- ●Horoscope | ఆగస్టు 9 రాశి ఫలాలు.. ఈ రాశివారిని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి!
- ●Theyyullathil Sree Kuttichathan Temple | భక్తుల కోరికలు తీర్చే కేరళ 'కుట్టిచాతన్' స్వామి.. ఇక్కడ దేవుడికి మద్యం, మాంసమే నైవేద్యం!
- ●Rajamahendravaram | ప్రాణం పోతుంటే.. పట్టించుకునేవారేరీ?

Mahesh Babu | మహేశ్ బాబు బర్త్డే స్పెషల్.. అదిరిపోయే లుక్లో రుద్ర..

Weekly Horoscope | ఈవారం రాశి ఫలాలు.. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి!

Traffic Restrictions | హైదరాబాద్లో బోనాలు.. ఈ రూట్లలో వెళ్లారో ఇక అంతే..!

Horoscope | ఆగస్టు 9 రాశి ఫలాలు.. ఈ రాశివారిని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి!





