త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pub Fire | ప‌బ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మ‌ర‌ణం  

Pub Fire | థాయ్‌లాండ్ (Thailand) రాజధాని బ్యాంకాక్‌లోని (Bangkok) ఓ పబ్‌లో భారీ అగ్నిప్రమాదం (Pub Fire) జ‌రిగింది. దీంతో 27 మంది అక్కడికక్కడే దుర్మ‌ర‌ణం చెందారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

G

International | Published On Jul 13, 2026, 6.33 am IST

Pub Fire | ప‌బ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మ‌ర‌ణం  
Advertisement

Pub Fire | త్రినేత్ర‌.న్యూస్‌: థాయ్‌లాండ్ (Thailand) రాజధాని బ్యాంకాక్‌లోని (Bangkok) ఓ పబ్‌లో భారీ అగ్నిప్రమాదం (Pub Fire) జ‌రిగింది. దీంతో 27 మంది అక్కడికక్కడే దుర్మ‌ర‌ణం చెందారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. సోమ‌వారం తెల్ల‌వారుజామున బ్యాంకాక్‌ చటుచాక్ జిల్లాలోని ‘నా లాడ్‌ప్రాయో పబ్ (Na Ladprao pub) ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మంట‌ల‌ను అదుపుచేయ‌డానికి అగ్నిమాప‌క సిబ్బంది గంట‌పాటు శ్ర‌మించాల్సి వ‌చ్చింది. గాయపడిన‌వారిని సమీపంలోని దవాఖాన‌లకు తరలించారు.

సోమవారం తెల్ల‌వారుజామున‌ పబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పబ్ ప్రవేశ ద్వారం వద్ద మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్న కస్టమర్లు బయటకు రావడానికి తీవ్రంగా శ్రమించారు. చూస్తుండ‌గానే భవనం మొత్తం దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగు తీసిన పలువురు కస్టమర్లు ఊపిరాడక, మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. స్టేజి వ‌ద్ద వ‌ప‌ర్ బ్రేక‌ర్ (Circuit Breaker) స‌మీపంలో మంట‌లు చెల‌రేగాయ‌ని మ్యుజీషియ‌న్ చెప్పారు. దీంతో క‌రెంటు పోయింద‌ని, భారీ పేలుడు సంభ‌వించింద‌న్నారు. అనంత‌రం ఆ ప్రాంత‌మంతా ద‌ట్ట‌మైన‌ పొగ అల‌ముకుంద‌ని తెలిపారు.

ప్రమాదంలో 27 మంది మరణించార‌ని థాయ్‌లాండ్ ప్రధాని అనుతిన్ చార్న్‌విరాకుల్ (Anutin Charnvirakul) ధ్రువీకరించారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని సంద‌ర్శించిన ఆయ‌న గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల క‌చ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేద‌న్నారు. కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

2022లో కూడా ఇలాంటి ఘ‌ట‌నే తూర్పు థాయ్‌లాండ్‌లోని ఓ మ్యూజిక్ పబ్‌లో (Music Pub) జ‌రిగింది. ఆ ప్రమాదంలో 14 మంది మరణించారు. అంతకుముందు 2009లో బ్యాంకాక్‌లోని (Bangkok) శాంతికా నైట్‌క్లబ్‌లో (Santika Nightclub) న్యూ ఇయర్ వేడుకల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏకంగా 66 మంది చ‌నిపోగా సుమారు 200 మందికిపైగా గాయ‌ప‌డ్డారు.

Advertisement
Advertisement