Iran | యురేనియం శుద్ధిపై వెనక్కి తగ్గేదే లేదు : అమెరికాకు తేల్చి చెప్పిన ఇరాన్
Iran | అగ్రరాజ్యం అమెరికా (America), ఇరాన్ (Iran) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతల వేళ యురేనియం శుద్ధి (uranium enrichment program) విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది.
International | Published On Feb 9, 2026, 12.33 pm IST
Iran | అగ్రరాజ్యం అమెరికా (America), ఇరాన్ (Iran) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతల వేళ యురేనియం శుద్ధి (uranium enrichment program) విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. తమ విధానాలను నిర్దేశించే హక్కు ఏ దేశానికీ లేదని స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చీ (Abbas Araghchi) ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం వచ్చినా యురేనియం శుద్ధి విషయంలో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.
అంతేకాదు, అరేబియా సముద్రంలో అబ్రహం లింకన్ యుద్ధ నౌకను అమెరికా మోహరించడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అమెరికా మోహరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. అమెరికాతో అణు ఒప్పందంపై ఒమన్‌లో పరోక్ష చర్చలు ఇటీవలే తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో అబ్బాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ చర్చలు విఫలమైతే దాడులు చేసేందుకు కూడా వెనకాడబోమని అమెరికా సంకేతాలిచ్చింది.
ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు
ఇరాన్ తన అణ్వాయుధ ఆశయాలను విరమించుకునేలా ఒప్పందం చేసుకునేందుకు చర్చలకు రావాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 'యుఎస్ఎస్ అబ్రహం లింకన్' (USS Abraham Lincoln) ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ నేతృత్వంలోని "భారీ నౌకాదళం (Massive Armada)" ఇరాన్ వైపు కదులుతోందని తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో ప్రకటించారు. వెనిజులాకు పంపిన దానికంటే ఇది చాలా పెద్ద నౌకాదళమని, ఇది శక్తి, ఉత్సాహం, లక్ష్యంతో వేగంగా కదులుతోందని పేర్కొన్నారు. ఈ సైన్యం తన మిషన్‌ను వేగంగా.. అవసరమైతే విధ్వంసకరంగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉందని ట్రంప్ హెచ్చరించారు.
మాపై దాడిచేస్తే పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధమే..
ఇరాన్ తన అణ్వాయుధ ఆశయాలను విరమించుకునేలా ఒప్పందం చేసుకునేందుకు చర్చలకు రావాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (ayatollah ali khamenei) తీవ్రంగా స్పందించారు. అమెరికా తమపై దాడికి పాల్పడితే అది పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు. తాము యుద్ధం కోరుకోవడం లేదని.. తమపై దాడి చేస్తే మాత్రం గట్టిగా సమాధానం ఇస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






