Venezuela | అమెరికా నిర్బంధంలో వెనిజులా అధ్యక్షుడు
Venezuela | వెనిజులా (Venezuela) అధ్యక్షుడు నికోలస్ ముదురో (Nicolas Maduro), ఆయన భార్యను అమెరికా (America) సైన్యం నిర్బంధించింది. వారిని అమెరికాకు తరలించినట్లు ఆ దేశ అధ్యక్షుడు (President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. మాదకద్రవ్యాల (Drugs) అక్రమ రవాణా అంశంలో గత కొంతకాలంగా వెనిజులాను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేస్తోంది.
International | Published On Jan 3, 2026, 3.53 pm IST
Venezuela | వెనిజులా (Venezuela) అధ్యక్షుడు నికోలస్ ముదురో (Nicolas Maduro), ఆయన భార్యను అమెరికా (America) సైన్యం నిర్బంధించింది. వారిని అమెరికాకు తరలించినట్లు ఆ దేశ అధ్యక్షుడు (President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. మాదకద్రవ్యాల (Drugs) అక్రమ రవాణా అంశంలో గత కొంతకాలంగా వెనిజులాను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేస్తోంది. మాదకద్రవ్యాలను తరలిస్తున్న పడవలు, జలాంతర్గాములపై దాడులను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో వెనిజులా రాజధాని కరాకస్‌లో ఏడు చోట్ల పేలుళ్లు జరిగాయి. పేలుళ్ల తరువాత భవనాలు, మంటల్లో చిక్కుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దాడుల నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించింది. అమెరికా దాడులు తమ దేశ సార్వభౌమత్వంపై జరుగుతున్న దాడులుగా అభివర్ణించింది. దేశంలో విస్తారంగా ఉన్న చమురు, ఇతర ఖనిజ వనరులను దోచుకునేందుకే అమెరికా దాడులు చేస్తోందని ఆరోపించింది. అమెరికా దాడులను ఇరాన్ సహా వివిధ అమెరికా వ్యతిరేక దేశాలు ఖండించాయి. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తక్షణమే ఐక్యరాజ్యసమితి, అమెరికన్ స్టేట్ ఆర్గనైజేషన్ తక్షణమే సమావేశం కావాలని కోరారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






