Ronaldo | చరిత్రపుటల్లో రొనాల్డో
Ronaldo | టొరొంటో వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో చరిత్ర పుటల్లో మరోసారి తన పేరును లిఖించుకున్నాడు. 41 ఏళ్ల వయసులోనూ నాకౌట్ మ్యాచ్‌లో తన తొలి ప్రపంచకప్ గోల్ నమోదు చేయడంతో పాటు టోర్నీ చరిత్రలో అరుదైన రికార్డులన్నీ తన పేరిట రాసుకున్నాడు.
- విశ్వకప్ నాకౌట్‌లో తొలి గోల్
Ronaldo | టొరొంటో వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో చరిత్ర పుటల్లో మరోసారి తన పేరును లిఖించుకున్నాడు. 41 ఏళ్ల వయసులోనూ నాకౌట్ మ్యాచ్‌లో తన తొలి ప్రపంచకప్ గోల్ నమోదు చేయడంతో పాటు టోర్నీ చరిత్రలో అరుదైన రికార్డులన్నీ తన పేరిట రాసుకున్నాడు. మ్యాచ్ రెండోభాగం 53వ నిమిషంలో ఇవాన్ పెరిశిచ్ గోల్‌తో క్రొయేషియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ ఒత్తిడిలోనూ పోర్చుగల్ వెనక్కి తగ్గలేదు. 64వ నిమిషంలో బాక్స్‌లో జరిగిన హ్యాండ్లింగ్ ఘటనను వీఏఆర్ పరిశీలించి.. అనంతరం రిఫరీ పోర్చుగల్‌కు పెనాల్టీ ఇచ్చాడు. ఆ అవకాశాన్ని రొనాల్డో సద్వినియోగం చేసుకొని గోల్ సాధించాడు. స్కోరు 1-1తో సమమైంది. అయితే, అసలైన ఉత్కంఠ ఎక్స్‌టైమ్‌లో జరిగింది. 90+4వ నిమిషంలో ప్రత్యామ్నాయ ఆటగాడు గోన్సాలో రామోస్ గోల్ చేయడంతో పోర్చుగల్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ ఆధిక్యమే చివరికి విజయం సాధించింది.
ఈ గోల్ రొనాల్డోకు ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచింది. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో అతని అన్ని గోల్స్ గ్రూప్ దశలోనే వచ్చాయి. కానీ, ఈసారి నాకౌట్ మ్యాచ్‌లో తొలి గోల్ నమోదు చేసి కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో అతని మొత్తం గోల్స్ సంఖ్య 3కి చేరగా, ప్రపంచకప్ మొత్తంలో 11 గోల్స్ సాధించి అత్యుత్తమ స్కోరర్ల జాబితాలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. మ్యాచ్‌లో 81వ నిమిషంలో రొనాల్డోను కోచ్ వెనక్కి పిలిచాడు. అతని స్థానంలో రూబెన్ నెవెస్ మైదానంలోకి వచ్చాడు. అదే సమయంలో మరో చారిత్రక రికార్డు కూడా రొనాల్డో ఖాతాలో చేరింది. 41 ఏళ్లు 147 రోజుల వయసులో ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ ఆడిన అత్యంత వయస్కుడిగా నిలిచాడు. అంతేకాదు 40 ఏళ్లు దాటిన తర్వాత నాకౌట్ మ్యాచ్‌లో గోల్ చేసిన తొలి ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు పెపే పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.
క్రొయేషితో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో విజయం సాధించిన పోర్చుగల్ ప్రీక్వార్టర్‌కు అర్హత సాధించింది. ఈ నెల 7న డల్లాస్‌లో 2010 ప్రపంచకప్ విజేత స్పెయిన్‌తో పోర్చుగల్ తలపడనుంది. మరోవైపు క్రొయేషియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇది క్రొయేషియా దిగ్గజం లుకా మోడ్రిచ్‌కు చివరి ప్రపంచకప్‌గా నిలవగా.. మ్యాచ్ అనంతరం రొనాల్డో అతన్ని ఆలింగనం చేసుకున్న దృశ్యం అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Amazon Prime Day 2026 | అమెజాన్ ప్రైమ్ డే 2026 బంపర్ డీల్స్.. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై భారీ తగ్గింపులు..
- ●Hyderabad | ఇద్దరూ కలిసి హోటల్‌కి వెళ్లారు.. అంతలోనే రూమ్‌లో యువతి మృతి
- ●Stock Markets | ఐటీ షేర్ల జోరుతో మార్కెట్లకు శుభారంభం.. భారీ లాభాల్లో నిఫ్టీ, సెన్సెక్స్..
- ●Ayatollah Ali Khamenei | అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు.. టెహ్రాన్‌కు భౌతికకాయం..
- ●Akkineni Akhil | కంగ్రాట్స్ సామ్.. సమంతకు అక్కినేని అఖిల్ విషెస్
- ●Spain Vs Austria | ఒయార్జబల్ డబుల్.. ప్రీక్వార్టర్స్‌లోకి స్పెయిన్

Amazon Prime Day 2026 | అమెజాన్ ప్రైమ్ డే 2026 బంపర్ డీల్స్.. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై భారీ తగ్గింపులు..

Hyderabad | ఇద్దరూ కలిసి హోటల్‌కి వెళ్లారు.. అంతలోనే రూమ్‌లో యువతి మృతి

Stock Markets | ఐటీ షేర్ల జోరుతో మార్కెట్లకు శుభారంభం.. భారీ లాభాల్లో నిఫ్టీ, సెన్సెక్స్..

Ayatollah Ali Khamenei | అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు.. టెహ్రాన్‌కు భౌతికకాయం..






