Naga Bhandham Review | నాగబంధం రివ్యూ – చిరంజీవి అంజి సినిమా కాపీ..కట్…పేస్ట్…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందిన నాగబంధం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మైథలాజికల్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ హిట్టు టాక్‌ను తెచ్చుకుందా? లేదా? అంటే?
Entertainment | Published On Jul 3, 2026, 11.59 am IST
Naga Bhandham Review | విరాట్ కర్ణ, నభా నటేష్ జంటగా నటించిన నాగబంధం మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అభిషేక్ నామా దర్శకత్వం వహించాడు. ఈ తెలుగు మూవీ ఎలా ఉందంటే?
అంజి సినిమా...
అంజి సినిమాలో ఆత్మలింగం కథ గుర్తుందా? ఆత్మ లింగం సాయంతో అమరత్వం పొందడం అనే పాయింట్‌తో అంజి రూపొందింది. ఆ ఆత్మలింగం ప్లేస్‌లో బ్రహ్మకమలం పెట్టి దానికి హిందూత్వం, సనాతన ధర్మం లాంటి నేటి ట్రెండింగ్ అంశాలను జోడించి నాగబంధం సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు.
విరాటస్వామి ఆలయంలో ఓ గదికి నాగబంధం వేసి ఉంటుంది. ఆ బంధాన్ని విచ్ఛిన్నం చేయాలంటే రంగనాథ స్వామి ఆలయంలోని బ్రహ్మకమలం, గరుడ మంత్రాలతో పాటు నాగబంధం బుక్ కావాలి. వాటి కోసం జుల్ఫీకర్ అలీ, భైరాగి ఎంతో మందిని చంపుతూ పోతుంటారు. జుల్ఫీకర్ అలీ (రిషబ్) కారణంగా తన కుటుంబాన్ని కోల్పోతాడు రుద్ర(విరాట్ కర్ణ). అలీతో రుద్ర శత్రుత్వం ఎన్నో జన్మల నుంచి ఉంటుంది. నాగబంధం ఛేదించాలనే వారి కుట్రలను రుద్ర ఎలా అడ్డుకున్నాడు? రుద్ర లైఫ్‌లోకి ప్రభాకర్(జగపతిబాబు), పార్వతి(నభా నటేష్) ఎలా వచ్చారు అన్నదే నాగబంధం మూవీ కథ.
కథ లేకుండా....
జానర్ ఏదైనా సినిమాకు కథే కీలకం. కథ లేకుండా ఎన్ని జిమ్కిక్కులు చేసినా ఫలితం ఉండదు. హిందుత్వం, సనాతన ధర్మం అనే అంశాలు ఇప్పుడు ట్రెండ్. ఈ కథలతో చాలానే సినిమాలు వచ్చాయి.... వస్తున్నాయి. వాటిలో నాగబంధం ఒకటి.
అనంతపద్మనాభ స్వామి ఆలయ చరిత్ర నుంచి స్ఫూర్తి పొంది దర్శకుడు ఈ కథను రాసుకున్నారు. నాగబంధాన్ని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించే విలన్లు...దైవ శక్తి సాయంతో వారిని ఎదురించే హీరో...వారి మధ్య సాగే పోరాటమే నాగబంధం మూవీ కథ. ఈ సింపుల్ పాయింట్‌ను మూడు గంటలు సాగతీసి ఆడియెన్స్ ఓపికకు పరీక్ష పెట్టాడు డైరెక్టర్.
కోట్లు ఖర్చు కానీ...
విజువల్స్, గ్రాఫిక్స్‌తో మెప్పిస్తే చాలని అనుకున్నారు మేకర్స్. ప్రతి ఫ్రేమ్‌ను రిచ్‌గా చూపించారు. ఒక్కో సెట్ కోసం కోట్ల ఖర్చు చేశారు. కానీ అసలైన కథను పక్కనపెట్టారు. అతుకుల బొంతలా సాగుతుంది. లాజిక్‌లు సంగతి సరేసరి. ఓ సీన్‌లో విలన్లకు దొరక్కుండా తమిళనాడులోని రంగనాథ స్వామి ఆలయం నుంచి పారిపోయిన చిన్నారి పరిగెత్తుకుంటూ హిమాలయాలకు చేరడం అన్నది విడ్డూరంగా అనిపిస్తుంది. 17 శతాబ్దం కథ అని చూపిస్తారు. ఆ సన్నీవేశాల్లో మోడ్రన్ మోడల్స్ లాంటి అమ్మాయిలు కనిపిస్తారు. యాక్షన్ సన్నివేశాల్లో రక్తం ఏరులై పారుతుంది. పాటలు సరైన ప్లేస్‌మెంట్ లేదు. సడెన్‌గా ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ హాఫ్‌లో వరుసగా వస్తాయి.ఫ్యామిలీ సీన్లు, లెక్కకు మించిన పాత్రలు, అనవసరపు సన్నివేశాలతో సినిమా సాగు....తూనే ఉంటుంది.
లెంగ్త్ మైనస్...
ఓ సినిమా కథను ఎంతలో చెప్పాలి. ఎక్కడ ముగించాలి అన్నది దర్శకుడికి తెలిసి ఉండాలి. మూడు గంటలకుపైగా రన్‌టైమ్‌తో ఆడియెన్స్‌ను థియేటర్లలో కూర్చోబెట్టాలంటే అందుకు తగ్గ స్టఫ్ ఉండాలి. నాగబంధంలో అదే లేదు. యాక్షన్ సీక్వెన్స్ సుధీర్ఘంగా సాగుతాయి. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ఒక్కటే నలభై ఐదు నిమిషాలు ఉంటుంది.
సినిమాలో బోలెడు మైనస్‌లో పాటు కొన్ని ప్లస్‌లు ఉన్నాయి. విజువల్స్, గ్రాఫిక్స్, సెట్ వర్క్ బాగున్నాయి. రంగనాథ స్వామి ఆలయం రియల్ ఫీలింగ్ కలిగిస్తుంది. అదొక్కటే కాదు ప్రతి సెట్ బాగుంది.
ఎక్స్‌ప్రెషన్స్ మిస్....
నాగబంధంలో విరాట్ కర్ణ హీరోగా నటించాడు. నటుడిగా ఇది అతడికి రెండో సినిమానే. తన ఇమేజ్‌కు మించిన పాత్రకు చాలా కష్టపడ్డాడు. లుక్, యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించాడు. కానీ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ సరిగ్గా పలకలేదు. డ్యాన్సుల్లో , ఎమోషనల్ సీన్లలో తేలిపోయాడు. నభా నటేష్ రోల్ సర్‌ప్రైజింగ్‌గా ఉంది. విలన్ పాత్రల్లో గరుడ రామ్, రిషబ్ మెప్పించారు. జగపతిబాబు, శరణ్య, మురళీ శర్మ, ఐశ్వర్య మీనన్‌తో పాటు స్క్రీన్‌పై చాలా మంది యాక్టర్లు కనిపిస్తారు. కానీ ఎవరికి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు.
నమోరే సాంగ్...
సినిమాకు పాటలు అవసరం లేదనిపిస్తుంది. నమోరే సాంగ్ ఒక్కటే బాగుంది. బీజీఎమ్ లౌడ్‌గా ఉంది. సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్లు చాలా కష్టపడ్డారు. ఈ సినిమాకు వంద కోట్ల బడ్జెట్ పెట్టామని ప్రమోషన్స్‌లో నిర్మాతలు చెప్పారు. ఆ బడ్జెట్‌కు తగ్గ క్వాలిటీ సినిమాలో కనిపించలేదు.
నాగబంధం ఆడియెన్స్ ఓపికకు పరీక్ష పెట్టే మైథలాజికల్ మూవీ. చివరి వరకు థియేటర్‌లో కూర్చోవడం అంటే సాహసమే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం






