Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో పెట్టుబడిదారుల జోరు.. ఒక్క రోజులోనే రూ.32వేలు పెరిగిన పసిడి ధర..
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య మళ్లీ శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు ఏర్పడుతుండడంతో పెట్టుబడిదారుల్లో ఉత్సాహం పెరిగింది. దేశీయ సూచీలు సైతం వరుసగా మూడో రోజు లాభాల్లో ట్రేడవుతుండగా, బులియన్ మార్కెట్లలోనూ ఉత్సాహం నెలకొంది.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య మళ్లీ శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు ఏర్పడుతుండడంతో పెట్టుబడిదారుల్లో ఉత్సాహం పెరిగింది. దేశీయ సూచీలు సైతం వరుసగా మూడో రోజు లాభాల్లో ట్రేడవుతుండగా, బులియన్ మార్కెట్లలోనూ ఉత్సాహం నెలకొంది. బంగారం, వెండి ధరలు అంతర్జాతీయంగా, దేశీయంగా భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1.31 శాతం మేర ఎగబాకి 4,179 డాలర్లకు చేరగా, వెండి ధర 2.42 శాతం మేర ఎగసి 62 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1954 పాయింట్లు పెరిగి 1,47,712 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 4,222 పాయింట్ల మేర పెరిగి 2,37,594 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,700 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,17, 600 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,47,000 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,70,000 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.32,200 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,475 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,07,800గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,34,750 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,47,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.29,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,025 ఉండగా, 8 గ్రాముల ధర రూ.88,200గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,10,250 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,02,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.24,100 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,60,000 ఉండగా, తులం ధర రూ.2,600 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. ఇన్వెస్టర్లకు ఇదే మంచి చాన్స్..?
ఆగస్టు 24, 2026

Murdered | హైదరాబాద్ మీర్పేట్లో దారుణం.. అర తులం బంగారం కోసం స్కూల్ ఆయా హత్య
ఆగస్టు 22, 2026

Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. బులియన్ మార్కెట్ల వైపు పెట్టుబడిదారుల చూపులు..
ఆగస్టు 22, 2026
తాజావార్తలు
- ●DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ
- ●UPI | యూపీఐకి పదేళ్లు.. వృద్ధి ప్రయాణంలో 2026 ఏడాది కీలకం
- ●Payal Shankar | విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన రేవంత్‌కు కనిపిస్తలేదా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్
- ●Police Constables Wedding | ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..! చర్చనీయాంశమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!
- ●Tollywood | మైథలాజికల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ కమెడియన్
- ●Fake DSP Arrest Hyderabad | ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌నంటూ బెదిరింపులు.. నకిలీ 'డీఎస్పీ'కి చెక్ పెట్టిన హైదరాబాద్ పోలీసులు

DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ

UPI | యూపీఐకి పదేళ్లు.. వృద్ధి ప్రయాణంలో 2026 ఏడాది కీలకం

Payal Shankar | విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన రేవంత్‌కు కనిపిస్తలేదా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్

Police Constables Wedding | ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..! చర్చనీయాంశమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!



