Quantum Research | సూర్యకాంతితో క్వాంటం ఇమేజ్.. చైనా శాస్త్రవేత్తల ఘనత..!
Quantum Research | క్వాంటం టెక్నాలజీ రంగంలో చైనా శాస్త్రవేత్తలు ఒక కీలక ముందడుగు వేశారు. ఇప్పటివరకు క్వాంటం ఫోటాన్లను రూపొందించాలంటే అత్యంత శక్తివంతమైన లేజర్ వ్యవస్థ తప్పనిసరిగా అవసరమని భావించేవారు. కానీ ఈసారి సాధారణ సూర్యకాంతినే ఉపయోగించి క్వాంటం-లింక్డ్ ఫోటాన్లను విజయవంతంగా రూపొందించగలిగామని చైనా పరిశోధకులు ప్రకటించారు.
Quantum Research | క్వాంటం టెక్నాలజీ రంగంలో చైనా శాస్త్రవేత్తలు ఒక కీలక ముందడుగు వేశారు. ఇప్పటివరకు క్వాంటం ఫోటాన్లను రూపొందించాలంటే అత్యంత శక్తివంతమైన లేజర్ వ్యవస్థ తప్పనిసరిగా అవసరమని భావించేవారు. కానీ ఈసారి సాధారణ సూర్యకాంతినే ఉపయోగించి క్వాంటం-లింక్డ్ ఫోటాన్లను విజయవంతంగా రూపొందించగలిగామని చైనా పరిశోధకులు ప్రకటించారు. ఈ ఫోటాన్ల సహాయంతో ‘ఘోస్ట్ ఇమేజింగ్’ అనే ప్రత్యేక సాంకేతికత ద్వారా కృత్రిమ చిత్రాలను రూపొందించారు. భవిష్యత్‌లో అంతరిక్ష కమ్యూనికేషన్ సిస్టమ్స్, సురక్షిత డేటా ట్రాన్స్‌మిషన్ రంగాలకు ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు.
జియామెన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని నిర్వహించగా.. ప్రముఖ జర్నల్ అడ్వాన్స్‌డ్ ఫోటానిక్స్‌లో ప్రచురించారు. ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా సూర్యాన్ని ట్రాక్ చేసే ఆటోమేటెడ్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. రోజు పొడవునా సూర్యుడి కదలికను అనుసరించే ఈ వ్యవస్థ, కాంతిని 20 మీటర్ల పొడవైన ప్రత్యేక ఆప్టికల్ ఫైబర్ ద్వారా చీకటి ప్రయోగశాలకు పంపింది. అక్కడ ఆ కాంతిని పీపీకేటీపీ అనే ప్రత్యేక క్రిస్టల్‌పై ప్రసరింపజేయడంతో క్వాంటం ఫోటాన్ పెయిర్స్ ఏర్పడ్డాయి. పీపీకేటీపీ (పీరియాడికల్లీ పోల్డ్ పొటాషియం టిటానైల్ ఫాస్ఫేట్) అనేది క్వాంటం ఆప్టిక్స్ ప్రయోగాల్లో ఉపయోగించే ప్రత్యేక క్రిస్టల్. ఇది కాంతి తరంగాలను నియంత్రితంగా మార్చి ఫోటాన్ పెయిర్స్‌ను సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సహజ సూర్యకాంతితో ‘స్పాంటేనియస్ ప్యారామెట్రిక్ డౌన్ కన్వర్షన్’ ప్రక్రియను మొదటిసారి ప్రేరేపించగలిగామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఈ పరిశోధనను శాస్త్రవేత్తలు అత్యంత కీలకమైందిగా భావిస్తున్నారు. ఇప్పటివరకు ఖరీదైన లేజర్ వ్యవస్థలపై ఆధారపడిన క్వాంటం ప్రయోగాలు, భవిష్యత్‌లో సూర్యకాంతితోనే సాధ్యమైతే ఖర్చు భారీగా తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు చిన్న పరిమాణంలో క్వాంటం పరికరాల అభివృద్ధికి ఇది దారి తీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతరిక్ష మిషన్లు, అత్యంత సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థలు, అధునాతన ఇమేజింగ్ టెక్నాలజీల్లో ఈ ఆవిష్కరణ ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, ఈ ప్రయోగ ఫలితాలు భవిష్యత్ క్వాంటం సాంకేతికతకు బలమైన సంకేతంగా నిలుస్తున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల






