త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shehbaz Sharif | ద‌క్షిణాసియాకు నిజ‌మైన ర‌క్ష‌కుడు.. ట్రంప్‌పై పాక్ ప్ర‌ధాని ప్ర‌శంస‌లు

Shehbaz Sharif | ఓవైపు పాకిస్థాన్ మంత్రులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తుంటే.. ఆ దేశ ప్ర‌ధాన మంత్రి (Pakistan PM) షెహ‌బాజ్ ష‌రీఫ్ (Shehbaz Sharif) మాత్రం ట్రంప్‌ను కాకాప‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

D

International | Published On Feb 20, 2026, 12.01 pm IST

Shehbaz Sharif | ద‌క్షిణాసియాకు నిజ‌మైన ర‌క్ష‌కుడు.. ట్రంప్‌పై పాక్ ప్ర‌ధాని ప్ర‌శంస‌లు
Advertisement

Shehbaz Sharif | ఓవైపు పాకిస్థాన్ మంత్రులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తుంటే.. ఆ దేశ ప్ర‌ధాన మంత్రి (Pakistan PM) షెహ‌బాజ్ ష‌రీఫ్ (Shehbaz Sharif) మాత్రం ట్రంప్‌ను కాకాప‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ట్రంప్‌ను ఏకంగా “ద‌క్షిణాసియా రక్షకుడు” (Saviour of South Asia) అంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు.

యుద్ధంతో చితికిపోయిన గాజాను పున‌రుద్ధ‌రించేందుకు వాషింగ్ట‌న్‌లో శాంతి స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి పాక్ ప్ర‌ధాని స‌హా ప‌లువురు దేశాధినేత‌లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అమెరికా అధ్య‌క్షుడిపై పాక్ ప్ర‌ధాని ప్ర‌శంస‌లు కురిపించారు. ఆయ‌న “మ్యాన్ ఆఫ్ ది పీస్‌” (man of peace) అంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. “భార‌త్‌-పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల‌ను అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఆప‌గ‌లిగారు. స‌రైన స‌మ‌యంలో స‌మ‌ర్థ‌వంతమైన నిర్ణ‌యాల‌తో ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల‌ను కాపాడారు. మీరు నిజంగా శాంతి కాముకుడ‌ని నిరూపించుకున్నారు. ద‌క్షిణాసియాకు నిజ‌మైన ర‌క్ష‌కుడు” అంటూ ట్రంప్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ట్రంప్ ని “శాంతి దూత”, “దక్షిణాసియాకు రక్షకుడు” అంటూ పాక్‌ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్య‌క్త‌మ‌వుతోంది.

పాక్‌ను టాయిలెట్ పేప‌ర్‌కంటే దారుణంగా వాడుకున్నారు..

కాగా, ఇటీవ‌లే ట్రంప్‌పై పాక్ ర‌క్ష‌ణ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్ (Khawaja Asif) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. యూఎస్ త‌న వ్యూహాత్మ‌క ప్ర‌యోజ‌నాల కోసం ఇస్లామాబాద్‌ను వాడుకుంద‌ని వ్యాఖ్యానించారు. త‌మ దేశాన్ని టాయిలెట్ పేపర్ కంటే ఘోరంగా తీసిపడేసిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 1999 త‌ర్వాత అమెరికాతో పాకిస్థాన్ చేతులు కలపడం చాలా పెద్ద తప్పని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణ‌యం పాక్‌కు శాశ్వ‌త న‌ష్టాన్ని క‌లిగించింద‌ని తెలిపారు. 'అఫ్గానిస్థాన్ విషయంలో అమెరికాతో చేతులు క‌ల‌ప‌డం మ‌నం చేసిన అతిపెద్ద త‌ప్పు. దాని వ‌ల్ల పాక్ చాలా న‌ష్ట‌పోయింది. దాని ప‌ర్యావ‌సానాల‌ను ఇప్ప‌టికీ అనుభ‌విస్తున్నాం. అమెరికా మ‌న దేశాన్ని త‌న వ్యూహాత్మ‌క ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంది. ఇస్లామాబాద్‌ను టాయిలెట్ పేప‌ర్‌కంటే దారుణంగా తీసిప‌డేసింది. అవసరం తీరిన తర్వాత పాకిస్థాన్‌ను అమెరికా పట్టించుకోలేదు. పాక్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎటువంటి సాయమూ చేయలేదు' అని ఖ‌వాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement