Fire Accident | స్కూల్‌లో అగ్నిప్రమాదం.. 24 మంది చిన్నారులు మృతి
Fire Accident | ఆఫ్రికా దేశం కాంగోలోని (Congo) బుకావు నగరంలో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఓ ఇంట్లో చెలరేగిన మంటలు పక్కపక్కనే ఉన్న రెండు పాఠశాలలకు వ్యాపించాయి.
International | Published On Sep 11, 2026, 7.21 am IST
Fire Accident | త్రినేత్ర.న్యూస్: ఆఫ్రికా దేశం కాంగోలోని (Congo) బుకావు నగరంలో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఓ ఇంట్లో చెలరేగిన మంటలు పక్కపక్కనే ఉన్న రెండు పాఠశాలలకు వ్యాపించాయి. దీంతో 24 మంది విద్యార్థులు (students) మృతిచెందారు. డజన్ల కొద్దీ విద్యార్థులు గాయపడ్డారు. మృతుల్లో 19 మంది బాలికలు, ఐదుగురు బాలురు ఉన్నారు.
బుకావులోని (Bukavu) ఓ ఇంట్లో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి పక్కనే ఉన్న రెండు స్కూళ్లకు వ్యాపించాయి. ఫురాహా సెకండరీ స్కూల్‌లో (Furaha secondary school) పలువురు విద్యార్థులో లోపల చిక్కుకుపోవడంతో ఊపిరాడక చనిపోయారు. ఉజామా ప్రైమరీ స్కూల్‌లో (Ujamaa primary school) కూడా విద్యార్థులు ప్రాణాలు వదిలారు. తప్పించుకునే క్రమంలో తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. పాఠశాల నుండి బయటకు వచ్చే దారి చాలా ఇరుకుగా ఉండటంతో కొందరు విద్యార్థులు కిటికీల నుంచి దూకారని, మరికొందరు ఒకేసారి తలుపు వైపు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగి పలువురు కిందపడిపోయారని వెల్లడించారు. పదుల సంఖ్యలో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
తాజావార్తలు
- ●BRICS Summit | భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్.. నేడు ప్రధాని మోదీతో భేటీ
- ●Venus Transit | నక్షత్రాన్ని మార్చుకోనున్న శుక్రుడు.. మూడురాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
- ●Horoscope | సెప్టెంబర్ 11 రాశిఫలాలు.. ఊహించని సవాళ్లు ఎదురయ్యే అవకాశం!
- ●Dragon Fruit on Terrace | టెర్రస్‌పై డ్రాగన్ ఫ్రూట్ సాగు.. నెలకు రూ. 4 లక్షలు సంపాదిస్తున్న రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు
- ●NHRC | కాంగ్రెస్ సర్కార్‌పై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు
- ●Telangana DGP | ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చులో పడొద్దు.. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవద్దు

BRICS Summit | భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్.. నేడు ప్రధాని మోదీతో భేటీ

Venus Transit | నక్షత్రాన్ని మార్చుకోనున్న శుక్రుడు.. మూడురాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిందే..!

Horoscope | సెప్టెంబర్ 11 రాశిఫలాలు.. ఊహించని సవాళ్లు ఎదురయ్యే అవకాశం!

Dragon Fruit on Terrace | టెర్రస్‌పై డ్రాగన్ ఫ్రూట్ సాగు.. నెలకు రూ. 4 లక్షలు సంపాదిస్తున్న రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు






