Plane Crash | అత్యవసర ల్యాండింగ్ అవుతుండగా కుప్పకూలిన విమానం.. ఇద్దరు పైలట్లు దుర్మరణం
Plane Crash | కరీబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్‌లో (Dominican Republic) ఘోర విమాన ప్రమాదం (Plane Crash) జరిగింది. అత్యవసర ల్యాండింగ్ కోసం (emergency landing) ప్రయత్నిస్తున్న ఓ ప్రైవేటు జెట్ విమానం కుప్పకూలింది.
International | Published On Jun 8, 2026, 9.43 am IST
Plane Crash | త్రినేత్ర.న్యూస్: కరీబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్‌లో (Dominican Republic) ఘోర విమాన ప్రమాదం (Plane Crash) జరిగింది. అత్యవసర ల్యాండింగ్ కోసం (Emergency Landing) ప్రయత్నిస్తున్న ఓ ప్రైవేటు జెట్ విమానం కుప్పకూలింది. లాండింగ్ సమయంలో రన్‌వేకు బలంగా తాకడంతో ఒక్కసారిగా పేలిపోయింది. క్షణాల్లోనే విమానం అగ్నిగుండాన్ని తలపించింది. మంటల్లో ఇద్దరు పైలట్లు మృతిచెందారు.
గల్ఫ్‌స్ట్రీమ్‌కు చెందిన జీ200 జెట్ విమానం లా రామన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నించింది. ఈ క్రమంలో విమానం వెనుకభాగం నేలను బలంగా తాకడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అప్పటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు.

కాగా, విమానం ఏ కారణంతో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించిందన్న విషయం ఇంకా తెలియరాలేదు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందా? ఇంజిన్ సమస్యా? లేదంటే వాతావరణ పరిస్థితుల ప్రభావమా? అసలు పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ఎందుకు ప్రయత్నించారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Tragic development: A private jet has crashed during an emergency landing attempt at La Romana International Airport in the Dominican Republic.#aircraft pic.twitter.com/Q4nmtpn4ul
— FL360aero (@fl360aero) June 7, 2026
తాజావార్తలు
- ●RS Praveen Kumar | ‘మహా’ ఓనర్ వంశీని ప్రశ్నించే దమ్ము లేదా? పోలీసులకు ఆదేశాలు ఎవరిస్తున్నరు?
- ●Mallu Bhatti Vikramarka | తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచ వేదికపై చాటనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Hyderabad biker | హిమాచల్‌లో హైదరాబాద్ బైక్ రైడర్ అదృశ్యం.. రెండు వారాలైనా లభించని ఆచూకీ
- ●VC Sajjanar | ప్రశాంత వాతావరణంలో వైభవంగా బోనాల ఉత్సవాలు: సీపీ సజ్జనర్
- ●Ponnam Prabhakar | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Infosys | ఐటీ పరిశ్రమల శ్రమదోపిడీ.. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు భారీగా ఫైన్

RS Praveen Kumar | ‘మహా’ ఓనర్ వంశీని ప్రశ్నించే దమ్ము లేదా? పోలీసులకు ఆదేశాలు ఎవరిస్తున్నరు?

Mallu Bhatti Vikramarka | తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచ వేదికపై చాటనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Hyderabad biker | హిమాచల్‌లో హైదరాబాద్ బైక్ రైడర్ అదృశ్యం.. రెండు వారాలైనా లభించని ఆచూకీ

VC Sajjanar | ప్రశాంత వాతావరణంలో వైభవంగా బోనాల ఉత్సవాలు: సీపీ సజ్జనర్






