TGSRTC | రాఖీ పండుగ.. స్పెషల్ బస్సుల్లో ఆర్టీసీ అదనపు బాదుడు
TGSRTC | రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ (TGSRTC) 5 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. అయితే జనం అవసరాలను ఆసరగా చేసుకుని ప్రయాణికుల జేబులకు చిల్లు (Ticket Charges) పెడుతున్నది.
TGSRTC | త్రినేత్ర.న్యూస్: రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ (TGSRTC) 5 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. అయితే జనం అవసరాలను ఆసరగా చేసుకుని ప్రయాణికుల జేబులకు చిల్లు (Ticket Charges) పెడుతున్నది. రాఖీ పండుగ పేరుతో స్పెషల్ బస్సుల్లో (Special Buses) అదనపు చార్జీలు వసూలు చేస్తున్నది. ఇష్టానుసారంగా టికెట్ రేట్లు పెంచి పండుగ రద్దీని క్యాష్ చేసుకుంటున్నది. సాధారణంగా హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు టికెట్ ధర రూ.290. పండుగ నేపథ్యంలో 1:50 రూల్ పేరుతో అదనంగా రూ.100 నుంచి రూ.150 చార్జీలు వసూలు చేస్తున్నది.
హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు మెట్రో డీలక్స్ స్పెషల్ బస్సులో రూ.400 చార్జీ చేస్తున్నది. అదేవిధంగా సూపర్ లెగ్జరీ బస్సుల్లో కూడా అదనపు చార్జీల బాదుతున్నది. స్పెషల్ బస్సుల్లో ఎక్కిన తర్వాత మార్గ మధ్యంలో ప్రయాణికుల నుంది కండక్టర్లు ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నది. దీంతో ప్రయాణికులు లబో దిబో మంటున్నారు. మరోవైపు ప్రత్యేక బస్సుల్లో జర్నలిస్టులకు టికెట్ రాయితీ వర్తించడం లేదు. ఏంటని ప్రశ్నిస్తే ఆప్షన్ చూపించడం లేదంటూ ఆర్టీసీ ఉద్యోగులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. ఆర్టీసీ అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు.
తాజావార్తలు
- ●CM Vijay | తమిళనాడు చరిత్రలోనే తొలిసారి.. అసెంబ్లీలో సీఎం సీటును వదిలి మంత్రులతో కూర్చున్న విజయ్
- ●Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. ఒక్క రోజులోనే రూ.31వేలు తగ్గిన బంగారం ధర..
- ●Praggnanandhaa | గ్రాండ్ చెస్ టూర్లో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా ఘనత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. ఐటీ షేర్ల ర్యాలీ..
- ●Konda Surekha | సీఎం రేవంత్ అపాయింట్మెంట్ కోరిన మంత్రి కొండా సురేఖ
- ●Tirupati Rao | రెండున్నరేండ్లు గడిచినా.. ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ సర్కార్: తిరుపతి రావు

CM Vijay | తమిళనాడు చరిత్రలోనే తొలిసారి.. అసెంబ్లీలో సీఎం సీటును వదిలి మంత్రులతో కూర్చున్న విజయ్

Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. ఒక్క రోజులోనే రూ.31వేలు తగ్గిన బంగారం ధర..

Praggnanandhaa | గ్రాండ్ చెస్ టూర్లో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా ఘనత

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. ఐటీ షేర్ల ర్యాలీ..





