Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. ఒక్క రోజులోనే రూ.31వేలు తగ్గిన బంగారం ధర..
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ కమోడిటీ మార్కెట్‌లో మాత్రం ప్రతికూల సంకేతాలు ఎదురవుతున్నాయి. గత పది రోజుల నుంచి మళ్లీ పరుగులు పెట్టిన పసిడి ధరలకు ఈ సెషన్ బ్రేక్ వేసింది. దేశీయ, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఒక్క రోజులోనే భారీగా పతనమయ్యాయి.
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ కమోడిటీ మార్కెట్‌లో మాత్రం ప్రతికూల సంకేతాలు ఎదురవుతున్నాయి. గత పది రోజుల నుంచి మళ్లీ పరుగులు పెట్టిన పసిడి ధరలకు ఈ సెషన్ బ్రేక్ వేసింది. దేశీయ, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఒక్క రోజులోనే భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర ఒక్క సెషన్‌లోనే 0.48 శాతం తగ్గి 4,578 డాలర్లకు చేరగా, వెండి ధర 0.73 శాతం తగ్గి 68 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 983 పాయింట్లు తగ్గి 1,58,013 వద్ద నిలవగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 976 పాయింట్లు తగ్గి 2,39,675 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బంగారం ధర ఒక్క రోజులోనే రూ.31వేలకు పైగా తగ్గింది. వెండి ధరలోనూ భారీ తగ్గుదల నమోదైంది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,982 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,27, 856గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,59,820 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,98,200 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.31,600 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,650 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,17,200గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,46,500 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,65,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.29,000 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,987 ఉండగా, 8 గ్రాముల ధర రూ.95,896గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,19,870 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,98,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.23,700 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,55,000 ఉండగా, తులం ధర రూ.2,550గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,60,000 ఉండగా, తులం ధర రూ.2,600 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. తగ్గిన బంగారం ధరలు..
ఆగస్టు 27, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోష్.. లాభాల స్వీకరణకు దిగిన పెట్టుబడిదారులు..
ఆగస్టు 26, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బంగారం కొనేందుకు మంచి చాన్స్..
ఆగస్టు 25, 2026
తాజావార్తలు
- ●Praggnanandhaa | గ్రాండ్ చెస్ టూర్లో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా ఘనత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. ఐటీ షేర్ల ర్యాలీ..
- ●Konda Surekha | సీఎం రేవంత్ అపాయింట్మెంట్ కోరిన మంత్రి కొండా సురేఖ
- ●Tirupati Rao | రెండున్నరేండ్లు గడిచినా.. ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ సర్కార్: తిరుపతి రావు
- ●Earrings Stolen | నేపాల్ విషాదం వేళ అమానవీయ ఘటన.. మహిళ మృతదేహం నుంచి చెవి పోగులు దోచుకున్న నీచులు
- ●Nepal Flash Floods | నేపాల్ జలప్రళయంలో 469 మంది మృతి.. 1,498 మంది ఆచూకీ గల్లంతు

Praggnanandhaa | గ్రాండ్ చెస్ టూర్లో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా ఘనత

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. ఐటీ షేర్ల ర్యాలీ..

Konda Surekha | సీఎం రేవంత్ అపాయింట్మెంట్ కోరిన మంత్రి కొండా సురేఖ

Tirupati Rao | రెండున్నరేండ్లు గడిచినా.. ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ సర్కార్: తిరుపతి రావు



