Revanth Reddy | సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) మంత్రులు కొండా సురేఖ (Konda Surekha), సీతక్క (Seethakka) రాఖీ కట్టారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన ఇద్దరు మంత్రులు.. ముఖ్యమంత్రికి రాఖీలు (Rakhi Pournami) కట్టి, మిఠాయిలు తినిపించి హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) మంత్రులు కొండా సురేఖ (Konda Surekha), సీతక్క (Seethakka) రాఖీ కట్టారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన ఇద్దరు మంత్రులు.. ముఖ్యమంత్రికి రాఖీలు (Rakhi Pournami) కట్టి, మిఠాయిలు తినిపించి హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆత్మీయ కలయికలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి ఆశీస్సులు అందజేశారు.

పరకాల వివాదం తర్వాత కొండా సురేఖ.. సీఎం నివాసానికి వెళ్లడం ఇదే మొదటిసారి. సీఎంతో భేటీ అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం కొండా సురేఖ తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏడాది లాగానే సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టానని చెప్పారు. ప్రత్యేకంగా బంగారు రాఖీ చేయించానని తెలిపారు. వారికి ఆడపడుచులందరి దీవెన ఉంటుంది. సుపరిపాలనను అందించాలని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి శక్తిని, యుక్తిని ఇవ్వాలని, ముఖ్యమంత్రి ఆశీర్వాదం కూడా ఆడపడుచులందరిపై ఉండాలని కోరుకుంటున్నాన్నారు. తెలంగాణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు.

నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా సహచర మంత్రి సీతక్క గారితో కలిసి సోదరులు ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారిని వారి నివాసంలో కలసి, రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశాను.
మహిళల సంక్షేమం, సాధికారతకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు పెద్దన్నగా అండగా… pic.twitter.com/SwelDvHyxy
— Konda Surekha (@iamkondasurekha) August 28, 2026

సీఎం రేవంత్ రెడ్డికి ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది రాఖీ కట్టా
సీఎం కోసం ప్రత్యేకంగా బంగారు రాఖీ చేయించి కట్టాను
సీఎం సహా ఆయన మనవడు, అల్లుడికి కూడా రాఖీ కట్టాను
సీఎం రేవంత్ రెడ్డికి మా ఆడపడుచుల దీవెనలు ఉంటాయి
- మంత్రి కొండా సురేఖ https://t.co/9gUFkWEuO2 pic.twitter.com/LtxwAV6YoV
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 28, 2026
తాజావార్తలు
- ●Rashmika Mandanna | బయోపిక్‌లో నేషనల్ క్రష్ - విజయ్ దేవరకొండకు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో రష్మిక సినిమా!
- ●Nepal Police | టిబెట్‌లో డ్యామ్ లీకేజీ.. నేపాల్‌లో మళ్లీ వరద హెచ్చరికలు.. బీహార్ గ్రామాల్లో హైఅలర్ట్
- ●India Canada Trade | భారత్-కెనడా బంధం బలోపేతం.. రూ.4.65 లక్షల కోట్ల వాణిజ్య లక్ష్యం..
- ●Donald Trump | అమెరికా-కెనడా ట్రేడ్ వార్.. సరస్సు పేరు మార్చిన ట్రంప్
- ●Toxic | టాక్సిక్ సినిమా టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ నిరసన- వీడియో వైరల్
- ●Nepal Flash Floods | వరద రూపంలో తరుముకొచ్చిన మృత్యువు.. పరుగులు తీసిన జనం.. షాకింగ్ వీడియో

Rashmika Mandanna | బయోపిక్‌లో నేషనల్ క్రష్ - విజయ్ దేవరకొండకు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో రష్మిక సినిమా!

Nepal Police | టిబెట్‌లో డ్యామ్ లీకేజీ.. నేపాల్‌లో మళ్లీ వరద హెచ్చరికలు.. బీహార్ గ్రామాల్లో హైఅలర్ట్

India Canada Trade | భారత్-కెనడా బంధం బలోపేతం.. రూ.4.65 లక్షల కోట్ల వాణిజ్య లక్ష్యం..

Donald Trump | అమెరికా-కెనడా ట్రేడ్ వార్.. సరస్సు పేరు మార్చిన ట్రంప్






