Shashi Tharoor | కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కాన్వాయ్‌పై దాడి.. గన్‌మెన్‌కు గాయాలు
Shashi Tharoor | కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor)కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్ (Shashi Tharoors Convoy)పై కొందరు దాడికి యత్నించారు.
Shashi Tharoor | కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor)కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్ (Shashi Tharoors Convoy)పై కొందరు దాడికి యత్నించారు. ఈ ఘటనలో థరూర్ వ్యక్తిగత గన్‌మెన్, డ్రైవర్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. మలప్పురం (Malappuram) జిల్లాలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళ్తుండగా తిరువల్లి చెల్లితోడు వంతెన సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనపై థరూర్ ఎక్స్ వేదికగా స్పందించారు. గతరాత్రి జరిగిన అవాంఛనీయ సంఘటనలో తన భద్రతా సిబ్బందిపై దాడి జరిగినట్లు తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఎలాంటి గాయాలూ కాలేదని తెలిపారు. దాడి గురించి తెలుసుకుని తన విషయంలో ఆందోళన చెందిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు, ఈ ఘటన తర్వాత కూడా ముందుగానే షెడ్యూల్ చేసిన రెండు కార్యక్రమాలను కొనసాగించినట్లు ఎంపీ తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై థరూర్ భద్రతా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు వండూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాళికావుకు చెందిన ఉమ్మర అనే నిందితుడిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 9న కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.
Also Read..
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా..? టాప్ మోడల్స్ ఇవిగో..!
బావిలో పడిన కారు.. ఒకే కుటుంబంలో 9 మంది మృతి
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ స్లో ఓవర్ రేట్.. పంజాబ్ టీమ్ మొత్తానికి జరిమానా..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






