Bangladesh Oath Ceremony 2026 | భారత్‌కి రండి.. బంగ్లాదేశ్ నూతన ప్రధాని రెహమాన్‌కి స్పీకర్ ఓంబిర్లా ఆహ్వానం
తారీఖ్ రెహమాన్ నేతృత్వంలో నూతనంగా ఏర్పడిన బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వతంత్రంగా అభివృద్ధి దిశలో ముందుకెళ్లేందుకు భారత్ సహకారం ఎప్పటికీ ఉంటుందని ఎక్స్ వేదికగా ఓం బిర్లా ట్వీట్ చేశారు.
International | Published On Feb 17, 2026, 7.35 pm IST
Bangladesh Oath Ceremony 2026 | బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బీఎన్‌పీ పార్టీ అధినేత తారీఖ్ రెహమాన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. తారీఖ్ రెహమాన్‌తో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాహబుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు. దాదాపు 17 ఏళ్ల ప్రవాస జీవితం తర్వాత సొంత దేశానికి తిరిగి వచ్చిన రెహమాన్ దాదాపు 35 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కి తొలి పురుష ప్రధానిగా ఎన్నికయ్యారు. గత 35 ఏళ్ల నుంచి బంగ్లాను ఇద్దరు మహిళా నేతలే ఏలారు. ఈ ప్రమాణ స్వీకారాన్ని జమాత్ ఈ ఇస్లామీ, ఎన్‌సీపీ పార్టీలు బహిష్కరించాయి.
రెహమాన్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరుపున లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. ఢాకాలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారానికి పలువురు ఇతర అంతర్జాతీయ నేతలు హాజరయ్యారు. పాకిస్థాన్ మంత్రి అహ్సన్ ఇక్బాల్ బంగ్లాకు వచ్చారు. ఇక 13వ బంగ్లాదేశ్ పార్లమెంట్‌కి ప్రతిపక్ష నేతగా జమాత్ ఈ ఇస్లామీ పార్టీ చీఫ్ శఫిక్వుర్ రెహమాన్‌ను ఎన్నుకున్నారు. ప్రతిపక్ష చీఫ్ విప్‌గా నేషనల్ సిటిజన్ పార్టీ కన్వెనర్ నాహిద్ ఇస్లామ్ పేరును నామినేట్ చేశారు.

ప్రమాణ స్వీకారం అనంతరం రెహమాన్‌తో ఓం బిర్లా భేటీ అయ్యారు. ఈసందర్భంగా భారత్‌ను సందర్శించాలని రెహమాన్‌ని ఆహ్వానించారు. తారీఖ్ రెహమాన్ నేతృత్వంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతమైన, ప్రగతిశీల, అందరినీ కలుపుకుపోయే బంగ్లాదేశ్ నిర్మాణానికి భారత్ సహకారం ఎప్పటికీ ఉంటుందని ఎక్స్ వేదికగా ఓం బిర్లా ట్వీట్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Justice Yashwant Verma Case | న్యాయమూర్తి యశ్వంత్ వర్మ కేసు.. లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక..
మే 19, 2026

Bangladesh | సరిహద్దుల్లో ముళ్లకంచెలకు భయపడం.. బెంగాల్ ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్
మే 12, 2026

Kanimozhi | కాంగ్రెస్‌తో పొత్తు ముగిసింది.. సభలో వారిపక్కన కూర్చోం.. ఓంబిర్లాకు డీఎంకే లేఖ
మే 8, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



