Venezuela Earthquakes | వరుస భూకంపాలతో వెనెజువెలాలో 32 మంది మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Venezuela Earthquakes | వెనెజువెలా (Venezuela)ను వరుస భూకంపాలు వణికించిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో ఇప్పటి వరకూ 32 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 700 మంది గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
International | Published On Jun 25, 2026, 1.42 pm IST
Venezuela Earthquakes | వెనెజువెలా (Venezuela)ను వరుస భూకంపాలు వణికించిన విషయం తెలిసిందే. నిమిషాల వ్యవధిలోనే 7.1, 7.5 తీవ్రతతో సంభవించిన రెండు భూకంపాలు విధ్వంసం సృష్టించాయి. భూ ప్రకంపనల ధాటికి భారీ భవనాలు నేలకూలాయి. రాజధాని కారకాస్‌తోపాటు (Caracas) దేశంలోని పలు నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఇక ఈ విపత్తులో ఇప్పటి వరకూ 32 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 700 మంది గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకావం ఉంది. ఇక ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారిని సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో ఆ దేశానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మృతులు లక్ష వరకు ఉండొచ్చు: యూఎస్‌జీఎస్
ఈ ప్రకృతి విపత్తు ధాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. మృతుల సంఖ్య 10 వేల నుంచి లక్ష వరకు ఉండే అవకాశం 44 శాతం ఉందని తెలిపింది. భారీ భూకంపాల నేపథ్యంలో ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితి (State of emergency) విధించింది. ఈ భూప్రకంపనలకు సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
- ●Anand Mahindra | వృద్ధ కళాకారుడికి అండగా నిలిచి.. ఔదార్యత చాటుకున్న ఆనంద్ మహీంద్రా
- ●Maharashtra FDA | పేపర్లో ఆహారం ఇస్తే కఠిన చర్యలు.. మహారాష్ట్రలో కొత్త ఫుడ్ సేఫ్టీ నిబంధనలు..
- ●Revanth Reddy | 28న నల్లగొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- ●Motilal Oswal | టెక్స్టైల్ షేర్లపై మోతీలాల్ ఒస్వాల్ బుల్ సెంటిమెంట్.. ఈ 5 స్టాక్స్‌కు బై రేటింగ్..
- ●Rajya Sabha MPs | 31 శాతం మంది రాజ్యసభ ఎంపీలపై క్రిమినల్ కేసులు.. రూ..5,300 కోట్ల ఆస్తితో తెలంగాణ ఎంపీ టాప్
- ●SBI | ఎస్బీఐలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. స్థానిక భాష తెలిసినవారికి ప్రాధాన్యం

Anand Mahindra | వృద్ధ కళాకారుడికి అండగా నిలిచి.. ఔదార్యత చాటుకున్న ఆనంద్ మహీంద్రా

Maharashtra FDA | పేపర్లో ఆహారం ఇస్తే కఠిన చర్యలు.. మహారాష్ట్రలో కొత్త ఫుడ్ సేఫ్టీ నిబంధనలు..

Revanth Reddy | 28న నల్లగొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Motilal Oswal | టెక్స్టైల్ షేర్లపై మోతీలాల్ ఒస్వాల్ బుల్ సెంటిమెంట్.. ఈ 5 స్టాక్స్‌కు బై రేటింగ్..






