Pak High Commission | దెబ్బకు దెబ్బ.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయం వెలుపల కూల్చివేతలు
Pak High Commission | మూడు రోజుల క్రితం ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ (Indian High Commission in Islamabad) వెలుపల ఉన్న రక్షణ బారికేడ్లు, పార్కింగ్ పోల్స్‌ను పాక్ పోలీసులు తొలగించిన విషయం తెలిసిందే. పాక్ చర్యకు భారత్ తాజాగా ప్రతీకారం తీర్చుకుంది. న్యూ ఢిల్లీ (Delhi)లోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయం (Pak High Commission) వెలుపల ఉన్న బారికేడ్లు, ట్రాఫిక్‌ను నియంత్రించే స్టాండ్‌లను పోలీసులు తొలగించారు.
Pak High Commission | త్రినేత్ర.న్యూస్ : దాయాది పాకిస్థాన్‌కు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. మూడు రోజుల క్రితం ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ (Indian High Commission in Islamabad) వెలుపల ఉన్న రక్షణ బారికేడ్లు, పార్కింగ్ పోల్స్‌ను పాక్ పోలీసులు తొలగించిన విషయం తెలిసిందే. పాక్ చర్యకు భారత్ తాజాగా ప్రతీకారం తీర్చుకుంది. న్యూ ఢిల్లీ (Delhi)లోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయం (Pak High Commission) వెలుపల ఉన్న బారికేడ్లు, ట్రాఫిక్‌ను నియంత్రించే స్టాండ్‌లను పోలీసులు తొలగించారు. వీసా విభాగం సమీపంలో ఏర్పాటు చేసిన క్యూ లైన్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను కూల్చివేశారు.
పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయం వెలుపల ఉన్న అనధికారిక కట్టడాలు, భద్రతా బారికేడ్లు, వీసా సెక్షన్ సమీపంలోని క్యూ-మేనేజ్‌మెంట్ ఏర్పాట్లను జేసీబీలతో కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. హైకమిషన్ కార్యాలయానికి నిర్ణయించిన ప్రాంగణ పరిధికి (Approved boundary) వెలుపల ఉన్న వీసా విభాగం క్యూ లైన్లు, కొన్ని తాత్కాలిక షెడ్లు అక్రమంగా నిర్మించినట్లు గుర్తించినట్లు అధికారులు చెప్పారు. దీంతో అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు వెల్లడించారు. కాగా, ఈ పరిణామాల నేపథ్యంలో భారత్-పాక్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఇటీవలే శ్రీనగర్ పర్యటన సందర్భంగా భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ జమ్ముకశ్మీర్‌ను భారతదేశంలో ఒక ముఖ్యమైన భాగంగా అభివర్ణించిన విషయం తెలిసిందే. గతంతో పోలిస్తే లోయలో భద్రతా పరిస్థితులు కూడా మెరుగుపడ్డాయని చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా పౌరులు కశ్మీర్‌కు వెళ్లకుండా గతంలో ఇచ్చిన ట్రావెల్ అడ్వైజరీలను పునఃసమీక్షించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. సెర్గియో జమ్ముకశ్మీర్‌ను ‘భారత్‌లో అంతర్భాగం’గా పేర్కొనడం దాయాదికి ఆగ్రహం తెప్పించింది. ఇస్లామాబాద్‌లోని అమెరికా తాత్కాలిక రాయబారి నటాలీ బేకర్‌ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనికి ప్రతి చర్యగానే ఇస్లామాబాద్‌లోని భారత్ హైకమిషన్ వెలుపల ఉన్న రక్షణ బారికేడ్లు, పార్కింగ్ పోల్స్‌ను తొలగించినట్లుగా తెలుస్తోంది. అందుకు ప్రతీకారంగానే ఇప్పుడు భారత్ సైతం తాజా చర్యలు చేపట్టినట్లుగా సమాచారం.
#WATCH | Delhi | Indian authorities dismantle the external security perimeter outside the Pakistan High Commission, removing traffic bollards and barricades that previously ring-fenced the diplomatic compound. pic.twitter.com/QYvbj7s7fE
— ANI (@ANI) August 20, 2026
Also Read..
ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
రెండేళ్ల రగడ మళ్లీ మండింది.. కొండా vs రేవంత్‌లో టీపీసీసీ నోటీసు ఎంట్రీ!
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | 20న లండన్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 18, 2026

e-rickshaw battery blast | ఈ రిక్షా బ్యాటరీ పేలి భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి
ఆగస్టు 17, 2026

Bomb Threats | స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు.. లిస్ట్‌లో రెడ్ ఫోర్ట్, హైకోర్టు, రైళ్లు
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..



