Sonia Gandhi | పౌరసత్వానికి ముందు ఓటు కేసు.. సోనియా గాంధీకి ఢిల్లీకోర్టులో ఊరట..!
Sonia Gandhi | పౌరసత్వానికి ముందే ఓటు కేసులో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీకి ఢిల్లీకోర్టు ఊరట కల్పించింది. 1983లో భారత పౌరసత్వం పొందడానికి ముందు.. 1980లోనే సోనియా ఓటుహక్కు పొందారని, మోసం, ఫోర్జరీ ద్వారా ఓటు హక్కు పొందిన ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ నమోదైన విషయం తెలిసిందే.
Sonia Gandhi | పౌరసత్వానికి ముందే ఓటు కేసులో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీకి ఢిల్లీకోర్టు ఊరట కల్పించింది. 1983లో భారత పౌరసత్వం పొందడానికి ముందు.. 1980లోనే సోనియా ఓటుహక్కు పొందారని, మోసం, ఫోర్జరీ ద్వారా ఓటు హక్కు పొందిన ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై స్పందన తెలిపేందుకు ఫిబ్రవరి 7 వరకు కాంగ్రెస్ నాయకురాలికి ఢిల్లీ కోర్టు సమయం ఇచ్చింది.
సోనియా 1983 ఏప్రిల్ 30న భారత పౌరసత్వం తీసుకున్నారు. అయితే, అంతకు ముందు నెలల ముందే ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీకి చెందిన న్యాయవాది వికాస్ త్రిపాఠి రౌస్ అవెన్యూ మేజిస్ట్రేట్ కోర్టులో సెప్టెంబర్‌లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. తీర్పును సవాల్ చేస్తూ త్రిపాఠి రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇటీవల కోర్టు విచారణ చేపట్టగా.. సోనియాతో పాటు ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపింది. తాజాగా ఈ అంశంపై మంగళవారం కోర్టు విచారణ జరిపింది. సోనియా తరఫు న్యాయవాది స్పందన తెలిపేందుకు దాఖలు చేసేందుకు సమయం కోరగా.. ఫిబ్రవరి 7 వరకు వాయిదా వేశారు. అదే రోజున మళ్లీ విచారించనున్నది. రౌస్ అవెన్యూ కోర్ట్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ న్యాయవాది వికాస్ త్రిపాఠి.. భారతీయ పౌరురాలు కాకపోయినా సోనియా జనవరి 1980లో న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓటరుగా ఆమె పేరును చేర్చారని మేజిస్ట్రేట్ కోర్టులో ఆరోపించారు.
ఇటలీకి చెందిన సోనియా.. 1968లో రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్నారు. 1983 ఏప్రిల్ 30న ఆమె భారత పౌరసత్వాన్ని తీసుకున్నారు. పౌరసత్వం పొందేందుకు మూడేళ్ల ముందు 1980లోనే ఆమె పేరు ఓటర్ల జాబితాలో నమోదైంది. ఈ విషయంపై 1982లో నిరసనలు వ్యక్తమవడంతో జాబితా నుంచి పేరును తొలగించారు. 1983 జనవరిలో మళ్లీ ఓటరు జాబితాలో చేర్చారు. ఆ సంవత్సరం ఏప్రిల్ 30న సోనియా పౌరసత్వం మంజూరైంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






