త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Baby Boy | కుమారుడు కావాల‌ని.. 19 ఏండ్ల‌లో 10 మంది అమ్మాయిల‌కు జ‌న్మ‌నిచ్చారు…

పున్నామ న‌ర‌కం నుంచి పుత్రుడు ర‌క్షిస్తాడ‌ని ఓ నానుడి ఉన్న‌ది. అలా మ‌గ సంతానం (Baby Boy) కోసం ఆ దంప‌తులు 19 ఏండ్ల‌పాటు నిరీక్షించారు. ఈ క్ర‌మంలో 10 మంది బాలిక‌ల‌కు (Daughters) జ‌న్మ‌నిచ్చారు.

G

National | Published On Jan 7, 2026, 9.47 am IST

Baby Boy | కుమారుడు కావాల‌ని.. 19 ఏండ్ల‌లో 10 మంది అమ్మాయిల‌కు జ‌న్మ‌నిచ్చారు…
Advertisement

చండీగఢ్‌: పున్నామ న‌ర‌కం నుంచి పుత్రుడు ర‌క్షిస్తాడ‌ని ఓ నానుడి ఉన్న‌ది. అలా మ‌గ సంతానం (Baby Boy) కోసం ఆ దంప‌తులు 19 ఏండ్ల‌పాటు నిరీక్షించారు. ఈ క్ర‌మంలో 10 మంది బాలిక‌ల‌కు (Daughters) జ‌న్మ‌నిచ్చారు. అయితే వారి ఎదురుచూపుల‌కు మూడు రోజుల క్రితం తెర‌ప‌డింది. 11వ సంతానంగా పండంటి బాబుకు ఆ ఇల్లాలు జ‌న్మ‌నివ్వ‌డంతో.. ఆ త‌ల్లిదండ్రుల‌తోపాటు త‌మ్ముడితో ఆడుకోవాల‌ని ఎదురుచూస్తున్న ఆ అక్క‌ల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. హ‌ర్యానాలోని (Haryana) జింద్ జిల్లా ఉచానాలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. అయితే ఆ తండ్రి త‌న అంద‌రు కూతుర్ల పేర్లు చెప్ప‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఉచానాకు చెందిన ఆ దంపతులకు దాదాపు 19 క్రితం వివాహమైంది. వారికి మొత్తం 11 మంది సంతానం. అయితే మగ పిల్లాడి కోసం ఎదురు చూసిన భార్యాభర్తలు వరుసగా 10 మంది బాలికలకు జన్మనిచ్చారు. చివరిగా జనవరి 4న మగ శిశువు జన్మించ్చింది. గ‌త శ‌నివారం (జనవరి 3న) 37 ఏండ్ల‌ మహిళ పురిటి నొప్పులతో ద‌వాఖాన‌లో చేరి... మరుస‌టిరోజు (ఆదివారం) సహజ ప్రసవం ద్వారా మగ బిడ్డకు జన్మనిచ్చిందని డాక్ట‌ర్ న‌ర‌వీర్ షియోరాన్‌ తెలిపారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా ఆ శిశువు తండ్రి సంజ‌య్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కుమారుడు కావాలని మా కోరిక. మా పిల్లలు కూడా తమ్ముడు కావాలని అడిగారు. అందుకే మగ పిల్లాడు పుట్టే వరకు వేచి చూశాం. ఇది మాకు 11వ సంతానం. ఇంతకు ముందు 10 మంది కుమార్తెలు ఉన్నారు అని చెప్పారు. నాకున్న కొద్దిపాటి ఆదాయంలో నా కూతుళ్లకు మంచి విద్య, వసతులు అందించడానికి ప్రయత్నిస్తున్నా. ఏం జరిగినా అది దేవుడి దయతోనే. ఉన్నంతలో మేం సంతోషంగా ఉంటున్నాం. నేడు అమ్మాయిలూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. నా కూతుళ్లను ప్రయోజకుల్ని చేసేందుకు ప్రయత్నిస్తా అని వెల్ల‌డించారు. సంజయ్‌కు 2007లో వివాహమైంది. మొదటి కుమార్తె శ్రిన (Shrina) 12వ తరగతి, రెండో కూతురైన అమృత (Amrita) 11వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ది తెలిపారు. మిగిలిన ఎనిమిది పిల్ల‌ల పేర్లు చెప్ప‌డానికి ఆయ‌న ఇబ్బంది ప‌డ్డారు.

ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అంత‌ మంది పిల్ల‌ల‌ను క‌న‌డం ప‌ల్ల ప‌లువురు నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఒకరిద్దరు పిల్లల్ని పెంచడానికే నానా అవస్థలు పడుతున్న ప్ర‌స్తుత‌ రోజుల్లో.. ఏకంగా 11 మందికి జన్మనివ్వడం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మగ సంతానం కోసం 11 మందిని కనడం సరికాదంటున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement