త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Old Delhi | పాత‌బ‌స్తీలో తీవ్ర‌ ఉద్రిక్తత.. మున్సిప‌ల్ సిబ్బంది, పోలీసుల‌పై జనం రాళ్ల దాడి

దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) పాతబస్తీ (Old Delhi) ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న‌ది. పాత‌బ‌స్తీలోని తుర్క్‌మ‌న్ గేట్ స‌మీపంలో పురాత‌న ఫైజ్-ఎ-ఇలాహీ మ‌సీదును ఆనుకుని ఉన్న ఆక్ర‌మ‌ణ‌ల‌ను (Encroachments) బుధ‌వారం తెల్ల‌వారుజామున భారీ బందోబ‌స్తు న‌డుమ మున్సిప‌ల్ అధికారులు కూల్చివేశారు.

G

National | Published On Jan 7, 2026, 8.46 am IST

Old Delhi | పాత‌బ‌స్తీలో తీవ్ర‌ ఉద్రిక్తత.. మున్సిప‌ల్ సిబ్బంది, పోలీసుల‌పై జనం రాళ్ల దాడి
Advertisement

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) పాతబస్తీ (Old Delhi) ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న‌ది. పాత‌బ‌స్తీలోని తుర్క్‌మ‌న్ గేట్ స‌మీపంలో పురాత‌న ఫైజ్-ఎ-ఇలాహీ మ‌సీదును ఆనుకుని ఉన్న ఆక్ర‌మ‌ణ‌ల‌ను (Encroachments) బుధ‌వారం తెల్ల‌వారుజామున భారీ బందోబ‌స్తు న‌డుమ మున్సిప‌ల్ అధికారులు కూల్చివేశారు. అర్ద‌రాత్రి 1.30 గంట‌ల‌కు చేప‌ట్టిన ఈ కూల్చివేత‌ల‌ను స్థానికులు అడ్డుకోవ‌డంతో ఒక్క‌సారిగా ఉద్రిక్త‌త ప‌రిస్థితి ఏర్ప‌డింది.

నిరసనకారులు భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వ‌డంతో, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీల‌కు ప‌నిచెప్పారు. అప్ప‌టికీ అదుపులోకిరాక‌పోవ‌డంతో టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. ఈ ఘర్షణల్లో ప‌లువురు పోలీసు సిబ్బందికి గాయాల‌య్యాయి. తుర్క్‌మన్ గేట్ పరిసరాల్లో దాదాపు 10 కంపెనీల ఢిల్లీ పోలీస్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్‌) బలగాలను ఇక్కడ మోహరించారు. పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, హైకోర్టు ఆదేశాల మేర‌కే కూల్చివేత‌లు చేప‌ట్టామ‌ని మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ ఢిల్లీ (MCD) అధికారులు వెల్ల‌డించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు మాత్రమే టియర్‌ గ్యాస్‌ ప్రయోగించామని పోలీసులు తెలిపారు. అంత‌కుముందు ఈ కూల్చివేతలను సవాలు చేస్తూ మసీదు సయ్యద్ ఇలాహి నిర్వాహక కమిటీ హైకోర్టును ఆశ్రయించింది. అయినప్పటికీ, గతంలోనే కోర్టు ఇచ్చిన గడువు ప్రకారం అధికారులు ఈ తొలగింపు చేపట్టారు.

Advertisement

తాజావార్తలు

Advertisement