Vijay Trisha | విజయ్, త్రిష బ్లాక్‌బస్టర్ మూవీ 21 ఏళ్ల తర్వాత థియేటర్లలో రీ రిలీజ్ – తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తే డిజాస్టర్
తమిళనాడు సీఎం దళపతి విజయ్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ తిరుపాచి 21 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలోకి రాబోతుంది. సెప్టెంబర్‌లో ఈ సినిమా రీ రిలీజ్ అవుతోంది. తిరుపాచి మూవీని తెలుగులో అన్నవరం పేరుతో పవన్ కళ్యాణ్ రీమేక్ చేశాడు. కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగులో మాత్రం డిజాస్టర్ అయ్యింది.
Entertainment | Published On Aug 2, 2026, 7.17 pm IST
Vijay Trisha | కోలీవుడ్‌లో దళపతి విజయ్, త్రిష..విజయవంతమైన జోడీగా పేరుతెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఐదు సినిమాలు రాగా...అవన్నీ బ్లాక్‌బస్టర్స్‌గా నిలవడమే కాకుండా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. గిల్లీ మూవీతో ఫస్ట్ టైమ్ విజయ్, త్రిష జంటగా తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ తర్వాత తిరుపాచిలో నటించారు.
బెస్ట్ యాక్టర్‌గా...
2005లో రిలీజైన తిరుపాచి కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్‌గా దళపతి విజయ్ తమిళనాడు స్టేట్ అవార్డును అందుకున్నారు. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌కు యాక్షన్ అంశాలను జోడించి దర్శకుడు పేరారసు ఈ సినిమాను తెరకెక్కించారు. విజయ్ యాక్టింగ్, అతడిపై తెరకెక్కించిన యాక్షన్ అంశాలు, సెంటిమెంట్ సీన్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విజయ్ త్రిష రొమాంటిక్ సీన్లు, పాటల్లో వారి కెమిస్ట్రీ తిరుపాచి విజయంలో కీలకంగా నిలిచాయి.
21 ఏళ్ల తర్వాత...
దాదాపు 21 ఏళ్ల తర్వాత తిరుపాచి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెప్టెంబర్‌లో ఈ మూవీ రీ రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం 4కేతో పాటు రీ మాస్టర్ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో తిరుపాచి థియేటర్లలోకి రానున్నట్లు చెబుతున్నారు.
కోలీవుడ్‌లో ఫేమస్...
ఈ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. విజయ్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సీఎం విజయ్‌తో త్రిష ప్రేమలో ఉన్నట్లుగా, వీరి పెళ్లిచేసుకోబోతున్నట్లుగా చాలా కాలంగా రూమర్లు వస్తున్నాయి. ఈ పుకార్లతో త్రిష కోలీవుడ్ ఫేమస్ సెలిబ్రిటీగా మారిపోయింది.
వీరిద్దరి క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతోనే తిరుపాచిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ రీమేక్...
దళపతి విజయ్ తిరుపాచి సినిమాను అన్నవరం పేరుతో పవన్ కళ్యాణ్ తెలుగులో రీమేక్ చేశాడు. ఈ రీమేక్‌లో ఆసిన్ హీరోయిన్‌గా నటించింది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన అన్నవరం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sukhbir Singh Badal | అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడి
- ●Chiranjeevi | కదిరి కాకాజీగా చిరంజీవి - మెగాస్టార్ బర్త్‌డేకు డబుల్ ట్రీట్
- ●MP Mallu Ravi | వందేమాతరం పాడి వెళ్లిపోయారు.. ప్రధాని, అమిత్ షాపై మల్లు రవి ఆగ్రహం
- ●Google Pixel 11 Pro Fold | గూగుల్ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్.. మైండ్ బ్లాక్ అయ్యే ధర..
- ●Monsoon Session | 12 బిల్లులకు ఆమోదం.. ఒక్క దానిపైనే చర్చ
- ●Advanced Tip | ముందస్తు టిప్ కుదరనే కుదరదు.. యాప్ లో నుంచి ఆప్షన్ తొలగించండి..క్యాబ్ సంస్థలకు కేంద్రం ఝలక్..

Sukhbir Singh Badal | అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడి

Chiranjeevi | కదిరి కాకాజీగా చిరంజీవి - మెగాస్టార్ బర్త్‌డేకు డబుల్ ట్రీట్

MP Mallu Ravi | వందేమాతరం పాడి వెళ్లిపోయారు.. ప్రధాని, అమిత్ షాపై మల్లు రవి ఆగ్రహం
Google Pixel 11 Pro Fold | గూగుల్ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్.. మైండ్ బ్లాక్ అయ్యే ధర..






