Earthquakes | సిక్కింలో అర్ధరాత్రి భూకంపం.. వరుస ప్రకంపణలతో వణికిపోయిన జనం
Earthquakes | ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim) వరుస భూకంపాలతో (Earthquakes) వణికిపోయింది. అర్ధరాత్రి ప్రారంభమైన ప్రకంపణలు తెల్లవారుజామున 5.29 గంటల వరకు కొనసాగాయి. గ్యాల్‌షింగ్ (Gyalshing), గ్యాంగ్‌టక్, నామ్చీ, మాంగన్‌లో (Mangan) గంటల వ్యవధిలో వరుగా భూమి కంపించింది.
Earthquakes | త్రినేత్ర.న్యూస్: ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim) వరుస భూకంపాలతో (Earthquakes) వణికిపోయింది. అర్ధరాత్రి ప్రారంభమైన ప్రకంపణలు తెల్లవారుజామున 5.29 గంటల వరకు కొనసాగాయి. గ్యాల్‌షింగ్ (Gyalshing), గ్యాంగ్‌టక్, నామ్చీ, మాంగన్‌లో (Mangan) గంటల వ్యవధిలో వరుగా భూమి కంపించింది. తొలుత అర్ధరాత్రి 1.09 గంటల సమయంలో గ్యాల్‌షింగ్ ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.5గా నమోదయింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5.30 గంటల వరకు మొత్తం 12 సార్లు భూమి కంపించిందని ఎన్‌సీఎస్ తెలిపింది.
అర్ధరాత్రి 1.15 గంటలకు గ్యాంగ్‌టక్‌లో (Gangtok) 3.1 తీవ్రతతో, 2.03 గంటలకు 2.5 తీవ్రతతో మాంగన్‌లో భూమి కపించింది. 2.20 గంటలకు నామ్చీ (Namchi) ప్రాంతంలో 3.9 తీవ్రతతో, 2.43 గంటలకు మరోసారి నామ్చీలోనే 2.4 తీవ్రతతో ప్రకంపణలు వచ్చాయి. ఆ తర్వాత మాంగన్‌లో 2.56 గంటలకు 2.4 తీవ్రతతో, 3 నిమిషాల వ్యవధిలో (2.59 గంటలకు) మరోసారి 2.5 తీవ్రతతో, 3.11 గంటలకు నామ్చీ ప్రాంతంలో 4.0 తీవ్రతతో, 3.36 గంటలకు మాంగన్‌లో, 3.52 గంటలకు 2.7 తీవ్రతతో మరోసారి మాంగన్‌లోనేలో భూమి కంపించింది.
మళ్లీ 4.57 గంటలకు 2.2 తీవ్రతతో మాంగాన్‌లో, 5.29 గంటలకు నామ్చీలో 2.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. వరుస భూకంపాలతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మళ్లీ ప్రకంపణలు వస్తాయేమోనన్న ఆందోళనతో నిమిషాల తరబడి బయటే ఉండిపోయారు. కాగా, వరుస భూకంపాల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
సిక్కింలోనే కాకుండా దాని చుట్టుపక్కన ఉన్న మయన్మార్, టిబెట్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కూడా భూమి కంపించింది. మయన్మార్‌లో శుక్రవారం ఉదయం 6:03 గంటలకు భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది. ఇక టిబెట్‌లో 2.30 గంటలకు 4.5 తీవ్రతతో, 7.19 గంటలకు 4.4 తీవ్రతతో, ఉత్తరప్రదేశ్‌లో 7.32 గంటలకు 3.7 తీవ్రతతో, ఉత్తరాఖండ్‌లో 7.48 గంటలకు 3.4 తీవ్రతతో భూమి కపించింది.
https://publish.twitter.com/?url=https://twitter.com/NCS_Earthquake/status/2019499476059320370#
తాజావార్తలు
- ●Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..
- ●Mallikarjun Kharge | ప్రధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మగా మారారు.. సర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖర్గే
- ●Kavitha | ఏమున్నా నేన్ ఆధారాలతోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు కవిత వార్నింగ్
- ●Stocks | భారత్‌లోనే కాదు, విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడి పెట్టాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
- ●POCSO Case | బాలుడిపై లైంగిక దాడి.. పోక్సో కేసులో టీచర్‌కు యావజ్జీవ శిక్ష
- ●Hyderabad | ద్విచక్ర వాహనాల చోరీ.. ఇద్దరు టీనేజర్లు అరెస్ట్.. 8 స్కూటర్లు స్వాధీనం

Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..

Mallikarjun Kharge | ప్రధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మగా మారారు.. సర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖర్గే

Kavitha | ఏమున్నా నేన్ ఆధారాలతోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు కవిత వార్నింగ్

Stocks | భారత్‌లోనే కాదు, విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడి పెట్టాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..






