త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yashoda and Krishna | రూ.167 కోట్లు ప‌లికిన‌ “య‌శోద కృష్ణ” పెయింటింగ్‌.. అత్య‌ధిక ధ‌ర ప‌లికిన చిత్రంగా రికార్డు

Yashoda and Krishna | ఆధునిక భారతీయ చిత్రకళా పితామహుడు రాజా ర‌వి వ‌ర్మ (Raja Ravi Varma) గీసిన "య‌శోద కృష్ణ" (Yashoda and Krishna) చిత్రం వేలంలో క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికింది.

D

Business | Published On Apr 2, 2026, 11.48 am IST

Yashoda and Krishna | రూ.167 కోట్లు ప‌లికిన‌ “య‌శోద కృష్ణ” పెయింటింగ్‌.. అత్య‌ధిక ధ‌ర ప‌లికిన చిత్రంగా రికార్డు
Advertisement

Yashoda and Krishna | ఆధునిక భారతీయ చిత్రకళా పితామహుడు రాజా ర‌వి వ‌ర్మ (Raja Ravi Varma) గీసిన "య‌శోద కృష్ణ" (Yashoda and Krishna) చిత్రం వేలంలో క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికింది. ముంబైలో జరిగిన ‘సాఫ్రన్ ఆర్ట్’ (Saffronart) స్ప్రింగ్ లైవ్ వేలంలో ఈ పెయింటింగ్ ఏకంగా రూ.167.20 కోట్లు (సుమారు 18 మిలియన్ డాలర్లు) పలికింది.

ఈ క‌ళాఖండాన్ని ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (Serum Institute of India) వ్యవస్థాపకులు సైర‌స్ ఎస్‌.పూనావాలా (Cyrus S Poonawalla) ద‌క్కించుకున్నారు. కేవలం 7 నిమిషాల పాటు జరిగిన హోరాహోరీ బిడ్డింగ్‌‌లో తొలుత ఈ చిత్రం రూ.80 కోట్ల నుంచి రూ.120 కోట్ల మ‌ధ్య ప‌లుకుతుంద‌ని అంచ‌నా వేశారు. అయితే, ఆ అంచ‌నాల‌కు మించి రెట్టింపు ధ‌ర‌కు అమ్ముడ‌వ‌డం విశేషం.

రాజా ర‌వి వ‌ర్మ 1890వ దశకంలో దీనిని చిత్రించారు. ఆ చిత్రంలో యశోదమ్మ ఆవు పాలు పితుకుతుండగా, వెనుక నుండి బాలకృష్ణుడు గిన్నెడు పాల కోసం చేతులు చాచుతున్న అందమైన దృశ్యాన్ని ఇందులో చూడవచ్చు. హిందూ పురాణాల్లోని ఓ మ‌ధుర ఘ‌ట్టాన్ని ర‌వివ‌ర్మ ఈ చిత్రంతో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. ఈ చిత్రం అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడైన ఆధునిక భార‌తీయ క‌ళాఖండంగా స‌రికొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఎం.ఎఫ్. హుస్సేన్ (M.F. Husain) గీసిన పెయింటింగ్ రూ.118 కోట్లు పేరిట ఉన్న రికార్డును ఇది బ్రేక్ చేసింది.

Also Read..

కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ పనుల్లో వేగం పెంచండి.. ఇంజినీరింగ్ అధికారులకు స్పెషల్ సీఎస్ ఆదేశం

సంక్షేమం, అభివృద్ధిలో రాజీపడకుండా పనిచేస్తున్నాం: సీఎం రేవంత్‌

రాముడిగా రణభీర్ విశ్వరూపం... రామాయణ టీజర్ అదుర్స్‌ - హాలీవుడ్‌కు ధీటుగా వీఎఫ్ఎక్స్‌

Advertisement
Advertisement